కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని రహదారుల విస్తరణ, కొత్తగా నిర్మించాల్సిన హైవేలు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు పలు అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రావాల్సిన నిధులు వచ్చేలా చూస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. రాత్రి సీఎంవో అధికారి భారతేందు వర్మ కుటుంబ సభ్యుల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన జంటను ఆశీర్వదించారు.