Kannepalli | అంతుచిక్కని వ్యాధితో

Kannepalli | అంతుచిక్కని వ్యాధితో

  • వీరాపుర్ నాటుకోళ్ల ఫామ్ లో 1600కోళ్లు మృతి
  • రూ.10లక్షలకు పైగా ఆస్తి నష్టం
  • రోడ్డున పడ్డ రైతు సొండ్ల చెందు మేర

Kannepalli | కన్నెపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని వీరాపూర్ మంగళవారం నాటుకోళ్ల ఫారంలో అంతుచిక్కని వ్యాధితో 1800కు పైగా కోళ్ళు మృత్యువాత పడ్డాయి. ఘటన స్థలాన్ని ఇవాళ‌ భీమిని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ సర్జన్ దొబ్బల కిరణ్ పరిశీలించారు. అంతు చిక్కని వ్యాధితోనే ఈ కోళ్లు మృత్యు వాత పడి ఉంటాయని కిరణ్ తెలిపారు. కోళ్ల నుంచి ఐదు శాంపిళ్ల‌ను సేకరించి ఆదిలాబాద్ లోని పశుసంవర్ధక శాఖ ల్యాబ్ కు తగు పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిపారు. ఈ సంఘటనతో నాటు కోళ్ల ఫామ్ రైతుచందు మేరకు పది లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

వివరాల్లోకి వెళితే… గ్రామానికి చెందిన సొండ్ల చంద్రుమేర అనే రైతు గత మూడు నెలల క్రితం స్వయం ఉపాధి పొందాలని గ్రామంలో స్వంత ఖర్చులతో నాటుకోళ్ల పెంపకం కోసం రూ. 3లక్షలు వెచ్చించి షెడ్డు నిర్మించి.. ఇంకో 5 లక్షలు వెచ్చించి సిద్ధిపేట నుండి నాటుకోళ్లు తెప్పించి పెంచుతున్నాడు. అంతా బాగానే ఉండి లాభాలు వస్తాయనుకున్న తరుణంలోనే అనూహ్యంగా సోమవారం 100 కోళ్లు మృతిచెందాయి.

దీంతో కలవరపడ్డ రైతు వెటర్నరీ డాక్టర్ శ్వేతను సంప్రదించగా కొన్ని మందులు ఇవ్వడం జరిగింది. ఆ మందులు వాడినా ఫలితం లేక మంగళవారం సాయంత్రం వరకు 1800 నాటుకోళ్లు మృతి చెందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరీక్షల నిమిత్తం ఐదు కోళ్ళ శాంపిళ్ళ నమూనాలు సేకరించి ఆదిలాబాద్ ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు. కాగా శ్వాసకోష వ్యాధి వల్ల చనిపోయి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా రైతు రూ.10 లక్షల వరకు నష్టపోయానని, తనని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆయన వెంట వెటర్ణటి సబార్డినెంట్ నరేష్, బాధిత రైతు ఉన్నారు.

Leave a Reply