హైదరాబాదు, అంధ్రప్రభ: ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ వికాస్ గౌడ్ సెర్బియన్ స్టొమటొలాజికల్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు బెల్డ్ వెళ్లనున్నారు. డెంటల్ ఇంప్లాంట్స్లో హార్డ్ అండ్ సాఫ్ట్ టిష్యూఆమేనిప్యులేషన్ గురించి తన అనుభవాలను, విజ్ఞానాన్ని పంచడమే ధ్యేయంగా ఆ ఆహ్వానం అందినట్టు డాక్టర్ గౌడ్ తెలిపారు. డెంట్ ఇంప్లాట్స్లో వివిధ రకాల ప్రయోగాలతో వినూత్న పద్దతులను ఆవిష్కరించిన ఘనత కలిగిన డాక్టర్ వికాస్ గౌడ్ అనుభవాలను ప్రపంచ డెంటల్ డాక్టర్లకు పంచాల్సిన అవసరం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
Invitation | డెంటల్ ఇంప్లాంట్స్ పై బిల్గ్రేడ్ సదస్సుకు డా.వికాస్ గౌడ్
