9mm Pistol | కార్డన్ సెర్చ్ లో కలకలం

9mm Pistol | కార్డన్ సెర్చ్ లో కలకలం

ట్రిగ్గర్ లాక్ తో బయటకు రాని బుల్లెట్

9mm Pistol | విజయవాడ, క్రైం : విజయవాడ బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్‌లో పోలీసుల తనిఖీల సమయంలో భారీ కలకలం రేగింది. వరంగల్ జిల్లా నెల్లికుదురుకు చెందిన ఓ వ్యక్తి తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ ట్రిగ్గర్ సమస్య వల్ల బుల్లెట్ బయటకు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తక్షణమే అతడిని అదుపులోకి తీసుకుని, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో హోటల్ పరిసరాల్లో భయాందోళన నెలకొంది. పోలీసులు అప్రమత్తమై దుండగుడిని పట్టుకున్నారు. 9ఎంఎం పిస్టల్, ఐదురౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply