అవ్వా నీ ఓటు మాకే… అభివృద్ధి చేసి చూపిస్తాము

అవ్వా నీ ఓటు మాకే… అభివృద్ధి చేసి చూపిస్తాము
8 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి విస్తృత ప్రచారం
మోత్కూర్, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ: మోత్కూరు మున్సిపాలిటీలో 8 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిని పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి అవ్వా మీ ఓటు మాకే…అభివృద్ధి పరుస్తాం అంటూ వృద్ధులను ఆత్మీయంగా పలకరిస్తూ ఆదివారం ఇంటింటి ప్రచారంలో భాగంగా విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా 8 వ వార్డులో ఓటర్లను అభ్యర్థిస్తూ ఓట్లు అడిగారు . 8వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ,అసంపూర్తి పనులు, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు,త్రాగునీటి శాశ్వత పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన కోసం అహర్నిశలు కృషి చేస్తామని… ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో 8 వ వార్డుకు అధిక నిధులు తెప్పించి అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి ..ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వీరి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ గుర్రం కవిత లక్ష్మీనరసింహారెడ్డి , మాజీ వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, నాయకులు పోచం బిక్షపతి, తమ్మినేని శ్రీనివాసరావు ,మాజీ వార్డ్ మెంబర్ అవిశెట్టి స్వామి, రాజాలు , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
