జిల్లా సహాయ కార్యదర్శిగా చికూరి బిక్షం ఎన్నిక…

జిల్లా సహాయ కార్యదర్శిగా చికూరి బిక్షం ఎన్నిక…

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన చికూరి బిక్షం ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నల్లగొండలో నిర్వహించిన ప్రజానాట్యమండలి జిల్లా 8వ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానన్నారు.

సమాజంలో ఉన్న అసమానతలను కళారూపాల ద్వారా ప్రజలకు చేరవేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా కమిటీ సభ్యులు, మహాసభ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పాలక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను కళారూపాల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ పోరాటాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply