86,700 పశువులు కొందాం
- పశుగ్రాసం కొరత లేకుండా గడ్డి పెంచుతాం
- చిత్తూరు డీఆర్డీయే ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు(Chittoor) జిల్లాలో స్వయ సహాయక సంఘాల మహిళలకు 86,700 పశువులు కొనుగోలు చేయడానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్(Sumit Kumar) ఆమోదించారని డీఆర్డీయే ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి(Sridevi) వెల్లడించారు. డీఆర్డీయే చేపడుతున్నపేదరిక నిర్మూలన కార్యక్రమాలలో భాగంగా పశుసంవర్ధక పథకాన్నిఅత్యంత ప్రాధాన్యంగా గుర్తించినట్టు చెప్పారు.
చిత్తూరు జిల్లాలో పశుపోషణ కార్యక్రమాల అమలుకు అత్యంత అనుకూలమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంలో, పెరుగుతున్నజనాభా(Population) అవసరాలకు అనుగుణంగా చిత్తూరు జిల్లాలో పశువుల పెంపకాన్ని, సంఖ్యను మరింతగా అభివృద్ధి పరచాలని సూచించారు. జిల్లాలో ఎక్కువ ప్రైవేటు డెయిరీలు, 35 ప్రభుత్వ బల్క్ మిల్క్(Bulk Milk) చిల్లింగ్ సెంటర్లు ఉన్నందున పాల ఉత్పత్తి అవసరం విరివిగా ఉందన్నారు.
ఈ పథకం విజయవంతంగా అమలుకు, జిల్లా స్థాయి జాయింట్ డైరెక్టర్(Joint Director), పశుసంవర్ధక శాఖ, పథక సంచాలకులు, డీ.ఆర్.డీ.ఏ. క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేస్తూ, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి(Strinidhi), సీ.ఐ.ఎఫ్. అంతర్గత రుణాలు ఇంటర్నల్ లెండింగ్(Internal Lending) వంటి ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు నచ్చిన విధంగా ఆరోగ్యకర పశువులను కొనుగోలు చేయించాలని సూచించారు.
ఈ సందర్భంలో పశుసంవర్ధక వైద్యులు (Veterinary Doctors), పశువుల నాణ్యతను నిర్ధారించి, ఆరోగ్యకర పశువులను మాత్రమే కొనుగోలు చేయడంలో కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. 2025-.. 26 ఆర్ధిక సంవత్సరానికి ఎ.సి.ఎల్.పి. (Annual Credit Livelihood Plan – వార్షిక అప్పుల జీవనోపాధి ప్రణాళిక)ను చిత్తూరు జిల్లాలో సిద్ధం చేశామన్నారు.
ఈ ప్రణాళిక ప్రకారం మొత్తం 86,700 పశువుల కొనుగోలుకు స్వయం సహాయక సంఘాల మహిళలు స్వయంగా ప్రతిపాదించియున్నారు. ఈ ప్రతిపాదనల అమలులో, సంబంధిత APMలు, వెటర్నరీ డాక్టర్లు, స్వయం సహాయక మహిళలకు గ్రామ సభల్లో విస్తృత అవగాహన కల్పించి, రీసైకిల్ కాకుండా, నాణ్యమైన పశువుల సంఖ్యను పెంచాలని సూచించారు.
కొనుగోలు చేసిన పశువులకు తప్పనిసరి ఇన్సురెన్సు(Insurance) చేయాలని సూచించియున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో పశువులు పెంపకం చేపట్టడంతో పశుగ్రాసం కొరత రాకుండా గడ్డి పెంపకం పై మహిళలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఫొడర్ ప్లాట్స్ (గడ్డి పెంపకం) మహిళలు చేపట్టి విధంగా నాణ్యమైన విత్తనాలు కూడా వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేయాలన్నారు.

