ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఉక్రెయిన్(Ukraine)పై డ్రోన్ దాడులతో రష్యా (Russia) విరుచుకుపడింది. 800 డ్రోన్లతో దాడి చేసింది. యుద్ధం మొదలయ్యాక ఇదే అతిపెద్ద అటాక్ అని చెప్పవచ్చు. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని మంత్రుల మండలి భవనంపై రష్యా ఆదివారం డ్రోన్లు(drones), క్షిపణులను ప్రయోగించింది. ఒక్కసారిగా మంత్రుల మండలి భవనం పైకప్పు నుండి పొగలు పైకి వ్యాపించాయి.
అగ్నిమాపక దళం (fire brigade) సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. ఈ భవనంలో మంత్రుల ఇళ్ళు, కార్యాలయాలు రెండూ ఉన్నాయి. రాజధానిలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయం(government headquarters)తో సహా అనేక నివాస భవనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, కొందరికి గాయాలయ్యాయి.

