8 PM Close Pak : పాక్ 8 PM క్లోజ్ Andhra Prabha News

8 PM Close Pak : పాక్ 8 PM క్లోజ్ Andhra Prabha News
- అమెరికా ఇరాన్ ససేమిరా
- రాజీ తంత్రం విఫలం
- స్వదేశ సమస్యలపై దృష్టి
- చమురు సంక్షోభం దెబ్బ..
- పాకిస్థాన్ ఆందోళన
- ఇంధన పొదుపుపై ఫోకస్
- రాత్రి 8కే మార్కెట్లు మూసివేత
- రెస్టారెంట్లకు మరో 2 గంటలు ఛాన్స్
- దేశవ్యాప్తంగా అమలు..
- సింధ్‌కు మినహాయింపు
- మెడికల్ షాపులకు మినహాయింపు
- ఇతరులకు కఠిన నియమాలు
(ఆంధ్రప్రభ, కరాచీ ప్రతినిధి )

8 PM Close Pak : అమెరికా, ఇరాన్ జగడం ఇప్పటిలో కొలిక్కి వచ్చే అవకాశం లేదని పాకిస్థాన్ నిర్ణయకం తీసుకుంది. ఈ రెండు దేశాల మధ్య రాజీకి కాల్పుల విరమణకు పాకిస్థాన్ శాయశక్తుల ప్రయత్నాలు ఫలించలేదు. వాళ్ల చావు వాళ్లు చస్తారు .. ముందు మన ఇంటి దీపం చక్కదిద్దుకునే ప్రయత్నం ప్రారంభించింది. చమురు సంక్షోభం తట్టుకోలేని స్థితిలో.. ఇంధనం పొదుపుపై పాకిస్థాన్ ఫోకస్ పెట్టింది. ఇక ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా మార్కెట్లను రాత్రి 8 గంటలకు, రెస్టారెంట్లు, వివాహ వేడుకలను రాత్రి 10 గంటలకు మూసివేయాలని తమ ప్రజలను పాకిస్థాన్ ఆదేశించింది.

8 PM Close Pak : బలవంతపు మూసివేతతో పా మార్కెట్లు, వాణిజ్య నగరాల్లో ఆర్థిక లావాదేవీలు పడిపోతాయని పాకిస్థానీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఆర్థిక రాజధాని కరాచీ, ఐటీ హబ్, ఇండస్టియల్ సెంటర్ లాహోర్, పాకిస్థాన్ మాంచెస్టర్ ఫైసలాబాద్, మెడికల్ హబ్ సియాల్ కోట్, అగ్ర, ఎలక్ట్రానిక్స్ హబ్ గుజ్రాన్ వాలాలో ఆర్థిక లావాదేవీలకు ఇబ్పంది తప్పదు.

8 PM Close Pak : ఇంధన పరిరక్షణ ప్రణాళికలో భాగంగా, సింధ్ మినహా దేశవ్యాప్తంగా మార్కెట్లు, మాల్స్ . షాపింగ్ ప్రాంతాలను రాత్రి 8 గంటలకల్లా మూసివేయాలని పాకిస్తాన్ ఆదేశించింది. రెస్టారెంట్లు , వివాహ వేడుకలను రాత్రి 10 గంటలకల్లా మూసివేయాలి, మెడికల్ స్టోర్లు ఫార్మసీలు యధావిధిగా పనిచేస్తాయి.
