8 Hours custody : అడ్డంగా… గోల్ఫ్ పులి Andhra Prabha Sports News

8 Hours custody : అడ్డంగా… గోల్ఫ్ పులి Andhra Prabha Sports News

  • ఫ్లొరిడాలో కారు బోల్తా
  • డ్రగ్స్ అనుమానంతో కేసు
  • మార్టిన్ కౌంటీ పోలీసులుఅరెస్ట్ |
  • 8 గంట‌లు జైలులో

( ఆంధ్ర‌ప్ర‌భ‌, ఫ్లోరిడా ప్ర‌తినిధి)

8 Hours custody

8 Hours custody : గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ (50) ఓ కారు ప్రమాదంలో తృటిలొ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ మద్యం సేవించి విచక్షణ రహితంగా కారును నడిపారనే అరోపణలతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. మార్టిన్ కౌంటీ జైలుకు తరలించారు. ఫ్లోరిడా నిబంధనల ప్రకారం, ఆయనను 8.00 గంటల పాటు జైలులో ఉంచారు. ఇంతకీ ఏమి జరిగింది . భారత కాలమానం (IST) ప్రకారం, ఫ్లోరిడాలోని జూపిటర్ ఐలాండ్‌లో 2026, మార్చి 28, శనివారం తెల్లవారుజామున సుమారు 12:30 గంటలకు గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ తన నివాసానికి సమీపంలోని సౌత్ బీచ్ రోడ్డులో డార్క్ కలర్ ల్యాండ్ రోవర్ నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వుడ్స్ అతివేగంతో తన ముందు వెళ్తున్న ప్రెజర్ క్లీనర్ ట్రక్కును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ట్రక్కు వెనుక ట్రైలర్‌ను ఆయన కారు ఢీకొట్టి, పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.

8 Hours custody

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో వుడ్స్‌కు గానీ, ఎదుటి వాహనంలోని వ్యక్తికి గానీ ఎటువంటి గాయాలు కాలేదు. వుడ్స్ స్వయంగా తన కారు ప్యాసింజర్ డోర్ నుంచి బయటకు వ‌చ్చారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే, అంటే స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆయనను అరెస్ట్ చేసి, భారత కాలమానం ప్రకారం శనివారం విడుదల చేశారు

8 Hours custody : టైగ‌ర్ హై డ్రామా

8 Hours custody

పోలీసులు ఆయనకు నిర్వహించిన బ్రీత్‌లైజర్ పరీక్షలో ఫలితం 0.00 గా వచ్చింది. అంటే ఆయన మద్యం సేవించలేదని తేలింది. అయినప్పటికీ, ఘటనా స్థలంలో ఆయన చాలా నీరసంగా (lethargic) ఉన్నారని , మత్తులో ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. ఏదైనా డ్రగ్స్ ప్రభావం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

8 Hours custody : యూరిన్ టెస్ట్ కు దూరం

8 Hours custody

యూ రిన్ టెస్ట్ చేయించుకోవాలని పోలీసులు కోరగా వుడ్స్ అందుకు నిరాకరించారు. మార్టిన్ కౌంటీ పోలీసులు ఆయనపై మూడు రకాల కేసులు నమోదు చేశారు . మత్తులో వాహనం నడిపారు.(DUI). ఆస్తికి నష్టం కలిగించారు. Property Damage). చట్టపర పరీక్షలకు నిరాకరించారు (Refusal to submit to a lawful te) ఈ కేసుల‌తో వుడ్స్‌ను మార్టిన్ కౌంటీ జైలుకు తరలించారు. ఫ్లోరిడా నిబంధనల ప్రకారం 8 గంటల పాటు అదుపులో ఉంచారు. అనంతరం విడుదల చేశారు. గతంలో 2017లో కూడా వుడ్స్ ఇలాంటి DUI కేసులోనే ఫ్లోరిడాలో అరెస్ట్ అయ్యారు.

8 Hours custody

ALSO READ : 2-Ai-Dogs : వావ్.. ఇ స్మార్ట్​ డాగ్స్ ఎంట్రీ! Andhra Prabha SPL News

Leave a Reply