- అరుదైన రూ.75 స్మారక నాణెం ప్రదర్శన
భారత రాజ్యాంగ వత్స్తోత్సవాన్ని పురస్కరించుకుని కోల్‌కతా టంకశాల గత ఏడాది విడుదల చేసిన రూ.75 స్మారక నాణాన్ని ఏలూరు నగరానికి చెందిన అలీఖాన్ మహమ్మద్ అరుదైన కలెక్షన్‌గా సేకరించారు.
రాజ్యాంగ ఆమోద దినోత్సవమైన నవంబర్ 26న ఈ విలువైన నాణాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రదర్శించారు. మొత్తం 35 గ్రాముల బరువుతో రూపొందించిన ఈ నాణెంలో 50% వెండి, 40% రాగి, మిగతా 10% నికెల్, జింక్ మిశ్రణగా ఉపయోగించినట్లు తెలిపారు.
వివిధ జాతీయ సందర్భాలను పురస్కరించుకుని ఇంతవరకు మొత్తం 14 రకాల రూ.75 వెండి స్మారక నాణేలు విడుదలైనట్లు అలీఖాన్ వివరించారు.

