గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి

గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి
చిట్యాల, ఆంధ్రప్రభ : గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల 20 నిమిషాల సమయంలో ఎన్ హెచ్ 65 రహదారిపై హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే దారిలో గల 7 హోటల్ దగ్గరలో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడని సమాచారం అందడంతో చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి అనంతరం ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.
మృతుడు వయసు 50 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్నాడని గుర్తుతెలియని వాహనం డి కొనడంతో ఇతను రోడ్డు ప్రమాదంలో తగిలిన గాయాల వల్ల చనిపోయి ఉంటాడని ఇతడు నలుపు రంగు స్వెటర్ బ్రౌన్ కలర్ పాయింట్ ధరించి ఉన్నాడని మృతునికి సంబంధించిన వివరాలు తెలిసిన వ్యక్తులు చిట్యాల పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని ఎస్సై తెలిపారు
