60-Rockets : హిజ్బుల్లా రాకెట్ల వర్షం Andhra Prabha News

60-Rockets : హిజ్బుల్లా రాకెట్ల వర్షం Andhra Prabha News

  • ఉత్తర ఇజ్రాయెల్​ గజగజ
  • కాల్పుల విరమణ బేఖాతర్​
  • లెబనాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడులు
  • హిజ్బుల్లా కీలక నేత బంధువు మృతి
  • మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు

(ఆంధ్రప్రభ, జెరుసలేం ప్రతినిధి )

60-Rockets

ఇజ్రాయెల్ స్థావరాలపై హిజ్బుల్లా రాకెట్ దాడులు జ‌రుపుతోంది. ఈ , దాడులు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఉత్త‌ర ఇజ్రాయెల్ వైపు 60 పైగా రాకెట్ల‌ను సంధించార‌ని స‌మాచారం. కిరియత్ ష్మోనా, మెటులా, మిస్గావ్ ఆమ్ సహా ఇజ్రాయెల్ స్థావరాలను తమ యోధులు రాకెట్లతో లక్ష్యంగా చేసుకున్నారని హిజ్బుల్లా తెలిపింది. అష్డోడ్, హైఫా నగరాల లక్ష్యంగా బాలిస్టిక్ క్షిప‌ణులు చేరిన‌ట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

60-Rockets : హిజ్బుల్లా రాకెట్ల వర్షం

60-Rockets

ఉత్తర ఇజ్రాయెల్ లక్ష్యంగా హిజ్బుల్లా సుమారు 60 పైగా రాకెట్లను ప్రయోగించింది. ప్రధానంగా కిరియత్ ష్మోనా, మెటులా, మిస్గావ్ ఆమ్ సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు హిజ్బుల్లా ధృవీకరించింది. హైఫాలోని మిష్మార్ అల్-కర్మెల్ క్షిపణి రక్షణ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం. హైఫా సమీపంలోని జీవ్ బేస్ (Ze’ev base) పై కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

60-Rockets : ఇజ్రాయోల్​ అప్రమత్తం

కిరియత్ ష్మోనాలో ఇజ్రాయెల్​ సైనికులు సైరన్లు ఆప్​ చేశారు. . ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఒక ఇంటిని ఓ క్షిపణి నేరుగా ఢీకొంది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కొన్ని చోట్ల కార్లు కాలిపోయాయి. లెబనాన్ వైపు: ఇజ్రాయెల్ ప్రతిగా జరిపిన దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ నయీమ్ ఖాసీం వ్యక్తిగత కార్యదర్శి అలీ యూసుఫ్ హర్షి మరణించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపింది.

60-Rockets : దాడి ప్రతి దాడి

60-Rockets

ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుతున్నాయి ఇరు పక్షాలూ కాల్పుల విరమణ ఒప్పందాలను లెక్కచేయటం లేదు. పరస్పరం దాడులు జరుపుతున్నాయి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ, ఉత్తర ప్రాంత ప్రజలకు పూర్తి భద్రత లభించే వరకు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు ఇజ్రాయెల్-అమెరికా దురాక్రమణ ముగిసే వరకు ఈ దాడులు కొనసాగుతాయని హిజ్జుల్లా హెచ్చరించింది.

ALSO READ : Iran Toll Troll : హోర్మజ్​ తెరిస్తే,, Andhra Prabha Top Story

Leave a Reply