Chhattisgarh | నారాయణపూర్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి !

  • కొన‌సాగుతున్న ఎదురుకాల్పులు

చ‌త్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన శుక్రవారం (జూలై 18, 2025) చోటు చేసుకుంది.

నారాయణపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికల గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి… ఈ క్ర‌మంలో ఇరువర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల గుర్తింపు ఇంకా నిర్ధారణ కాలేదు.

ఘటనా స్థలం నుండి ఆయుధాలు, పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు వివ‌రాలు తెలియాల్సి ఉంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు తమ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి.

Leave a Reply