ఘ‌నంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

ఘ‌నంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

రాప్తాడు, ఆంధ్రప్రభ : భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పోరాడిన గెలిచిన మననీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ పేర్కొన్నారు.రాప్తాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ ఎంపీడీవో విజయలక్ష్మి తాసిల్దార్ విజయ కుమారి డిప్యూటీ ఎంపీడీవో అశోక్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

జోహార్ పొట్టి శ్రీరాములు అంటూ నినాదాలు చేశారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ తెలుగు వాళ్ల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 1952లో మద్రాస్ లోని బలుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారు. 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారన్నారు. దివంగత పొట్టి శ్రీరాములు నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి ప్రాణత్యాగం చేశారని వివరించారు. ఆయన మృతితో ఎంతోమంది విద్యార్థులు అభ్యుదయ వాదులు బయటకు వచ్చి పోరాడినారు.

దీంతో తెలుగు వాళ్ళకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని అప్పటి ప్రధాని ప్రకటించారన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధన కోసమే కాకుండా సాంఘిక అసమానతలు దురాచారాలపై కూడా పొట్టి శ్రీరాములు అనేక పోరాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శమంతకమణి ఐసీడీఎస్ సూపర్వైజర్లు లీలావతి శ్రీవాణి ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply