₹5000 scam link| వైరల్ అవుతున్న ఫేక్ లింకులు – జాగ్రత్త!

₹5000 scam link| వైరల్ అవుతున్న ఫేక్ లింకులు – జాగ్రత్త!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్కామ్ మెసేజ్

పోలీసుల హెచ్చరిక – ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు

.xyz లింకులు ఎందుకు ప్రమాదకరం?

ఈ లింక్‌తో వచ్చే ప్రమాదాలు

ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

ఇప్పటికే క్లిక్ చేస్తే చేయాల్సిన చర్యలు

సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 వివరాలు

  • సంక్రాంతి పూట సైబర్ వల

₹5000 scam link | మంచిర్యాల, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతేలాలని భావిస్తే . సైబర్ (Cyber) మోసగాళ్ళు వదలడం లేదు. సందెట్లో సడేమియాలా దూరి సైబర్ వల పన్ని నిలువునా మోసం చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం మధ్యాహ్నం నుండి.. ఓ కిటుకు ప్రయోగించారు. ”మొదట ఇది నకిలీ అనుకున్నాను. కానీ నిజంగా నాకు ₹5000 వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి” అన్నదే ఆ మాయ.

ఈ పోస్టులు గురువారం సాయంత్రం 5 గంటలు దాటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యే సరికి పోలీస్ (Police) శాఖ అప్రమత్తమైంది. వెంటనే ప్రజలను అప్రమత్తం చేసేలా మరో మెసేజ్ పోస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి మెసేజ్ లను నమ్మవద్దని, అది సైబర్ మోసగాళ్ళ పని అని సూచించారు. ఇప్పటికైనా ప్రజలు సోషల్ మీడియాలో ప్రలోభాలకు గురి చేసే ప్రకటనలకు ఆకర్షితులు కాకుండా ఉంటే ఆర్థిక ఇక్కట్లు కొని తెచ్చుకునే ప్రమాదం నుండి బయట పడే అవకాశం ఉంది.

⚠️ ప్రజలకు హెచ్చరిక : ₹5,000 వచ్చాయంటూ వస్తున్న ఫేక్ లింకులు – జాగ్రత్త!
“మొదట ఇది నకిలీ అనుకున్నాను కానీ నిజంగా నాకు ₹5,000 వచ్చాయి, మీరు కూడా ట్రై చేయండి”
అంటూ కొన్ని లింకులు వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతున్నాయి.
👉 ఇది పూర్తిగా అనుమానాస్పదమైన స్కామ్ (మోసం) లింక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
🚩 ఈ లింక్ ఎందుకు ప్రమాదకరం?
🔹 లింక్ చివరలో .xyz డొమైన్ ఉంది
🔹 నమ్మదగిన బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఇలాంటి లింకులు ఉపయోగించవు
🔹 లింక్ ఓపెన్ చేయగానే వివరాలు అడిగే అవకాశం ఉంది
🔹 మొబైల్ నెంబర్, OTP, UPI, బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుని ఖాతా ఖాళీ చేసే ప్రమాదం ఉంది
❌ ఇలాంటి లింక్‌లతో వచ్చే ప్రమాదాలు

₹5000 scam link
₹5000 scam link
  • బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోవడం
  • మొబైల్ హ్యాక్ కావడం
  • వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం
  • సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం
    ✅ ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు
    ✔️ డబ్బులు వచ్చాయంటూ వచ్చే లింకులను క్లిక్ చేయవద్దు
    ✔️ తెలియని లింకులకు OTP, UPI పిన్ ఇవ్వకండి
    ✔️ అలాంటి మెసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు
    ✔️ సందేహం ఉంటే బ్యాంక్ లేదా సైబర్ క్రైమ్‌కు సమాచారం ఇవ్వండి
    🚨 ఇప్పటికే క్లిక్ చేసి ఉంటే?
    👉 వెంటనే:
    బ్యాంక్ పాస్‌వర్డ్ / UPI పిన్ మార్చండి
    బ్యాంక్ కస్టమర్ కేర్‌కు సమాచారం ఇవ్వండి
    సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ – 1930 కు కాల్ చేయండి
  • డబ్బు సులభంగా వచ్చేస్తుందని చెప్పే ఆఫర్లను నమ్మవద్దు.
    అంటూ పలు జాగ్రత్తలతో కూడిన సూచనలు చేయడంతో చాలా మంది సైబర్ మోసగాళ్ళ బారిన పడే ప్రమాదం నుండి బయటపడ్డారని తెలుస్తోంది.

CLICK HERE TO READ అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

₹5000 scam link
Cyber fraud Telugu states
Fake ₹5000 message
WhatsApp scam link
Facebook scam alert
Cyber crime warning
UPI fraud link
Bank scam messages
Sankranti cyber fraud
1930 cyber crime helpline
Online scam Telugu news

CLICK HERE TO READ MORE

Leave a Reply