ఆదరించి గెలిపించండి-అభివృద్ధి చేసి చూపిస్తా

4వ వార్డు బిజెపి అభ్యర్థి పికె.నర్సింహా

మక్తల్ , ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డు నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ బిడ్డగా ఆదరించండి ఆశీర్వదించండి గెలిపించండి వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని 4వ వార్డు బిజెపి అభ్యర్థి పీకే. నరసింహ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తన మద్దతుదారులతో కలిసి విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఈ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేస్తున్నది తనను గెలిపిస్తే ఏ ఏ పనులు చేపడుతానో వివరిస్తూ ఓటర్ల మద్దతు కోరారు. ఇంటింటి ప్రచారంలో పీకే. నరసింహ కు ఓటర్ల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ప్రాంతం వాడిని మీ బిడ్డను మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలిచాను నాకు అండగా నిలవండి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించండి మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమని అన్నారు. కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలమూరు పార్లమెంటు సభ్యులు డీకే. అరుణమ్మ సహకారంతో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను సాధించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేపడుతానని అన్నారు. మీ అందరివాడిగా మీకు మాటేస్తున్న ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మన ప్రాంత సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాను నన్ను నా పార్టీ నాయకత్వాన్ని నమ్మి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్ గా తనను భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా 4వ వార్డు బిజెపి అభ్యర్థి పీకే. నరసింహ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఈసారి నగప్ప, కుర్వ హన్మంతు,
తిరుపతి వెంకటేష్,
కురువ లింగప్ప, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply