4Mn Iran Women Fighters : వీళ్లే వీర వ‌నిత‌లు Andhra Prabha TOP Story

4Mn Iran Women Fighters : వీళ్లే వీర వ‌నిత‌లు Andhra Prabha TOP Story

  • యుద్ధంలో మ‌గ ధీరులు
  • ఇరానీ మహిళలు..
  • పోరాటమే జీవితం
  • బాలిక‌ల‌ స్కూల్‌పై దాడికి అందుకే
  • అనుమానంతోనే బాలిక‌ల స్కూలు టార్గెట్
  • బ‌డిలోనే బాసిజ్ శిక్షణ
  • కోవ్సర్, అల్-జహ్రా బెటాలియన్ల పాత్ర
  • అంతర్గత భద్రతలో మహిళల కీలక బాధ్యతలు
  • విద్యార్థి బాసిజ్ వ్యవస్థ విస్తరణ
  • పాఠశాలలే సైనిక కేంద్రాలా?
  • అంతర్జాతీయ ఆందోళనలు
  • ఇస్లామిక్ విప్లవంలో మహిళల పాత్ర ప్రారంభం
  • సమాజంలో గౌరవం.. రాజకీయాల్లో అవకాశాలు

(ఆంధ్ర‌ప్ర‌భ‌, టెహ్రాన్ ప్ర‌తినిధి)

ఇరాన్ మ‌హిళ‌లు.. స్వేచ్ఛ స‌మాన‌త్వం వీరి నినాదం. మ‌త సెద్ద‌ల హిజాబ్ ఫ‌త్వాను వ్యతిరేకించిన ధీర వ‌నిత‌లు వీరు. ఔను వీరి ర‌క్తంలోనే పోరాట ప‌టిమ ప‌ర‌వ‌ళ్లు తొక్ద్కుతోంది. వివ‌క్ష‌ను త‌ట్టుకోలేరు. తాడ‌న‌,. పీడ‌న‌ను స‌హించ‌రు. తాజా మ‌హిళ‌ల హ‌క్కుల పోరాటం కావొచ్చు.. 47 ఏళ్ల కింద‌ట ఇస్లామిక్ విప్ల‌వం కావొచ్చు,, అలుపెర‌గ‌ని విప్ల‌వ వీర వ‌నిత‌లు …. ఇరానీ మ‌హిళ‌లు. తాజాగా అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆప‌రేష‌న్ ఎథిక్ ప్యూరీ.. ప‌శ్చిమ ఆసియాను అగ్నిగుండంగా మార్చేసింది. అమెరికా బాంబుల వ‌ర్షం.. ఇజ్రాయెల్ క్షిప‌ణుల కుంభ వృష్టిని ఇరాన్ లెక్క చేయ‌టం లేదు. ప్ర‌ధాన నేత‌ల్ని అమెరికా లేపేసినా.. ఇరాన్ ప్ర‌జ‌లు త‌లొగ్గ‌లేదు. ప్ర‌తీకార దాడుల‌తో అమెరికా అంకుశాన్ని తిప్పికొడుతున్నారు. కేవ‌లం 10 కోట్ల జ‌నాభా క‌లిగిన ఈ చిన్న దేశం.. అమెరికా పెద్ద‌ల కుర్చీని మ‌డ‌త పెట్టెస్తోంది? పైగా గోడ కుర్చీ వేయించింది. ప్ర‌పంచ దేశాల‌న్నీ .. ఇరాన్ చుట్టూ తిరిగే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇందుకు కార‌ణ‌మేంటీ? అస‌లు ఇరాన్ బ‌ల‌మేంటీ ? ఇత్యాది స‌మాధానం దొర‌క‌ని ప్ర‌శ్న‌లు స‌ర్వ సాధార‌ణం.

4Mn Iran Women Fighters : దొడ్డిదారిలో.. అమెరికా దాడి

2026, ఫిబ్రవరి 28 శనివారం దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్ మినాబ్ నగరంలోని “షాజరే తయైబా” (Shajareh Tayyebeh) అనే ప్రాథమిక బాలికల పాఠశాలపై ఆప‌రేష‌న్ ఎథిక్ ప్యూరీ క్షిపణి దాడి జరిగింది. భారత కాలమానం (IST) ప్రకారం ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య ఈ దాడి జరిగింది, .మొత్తం 165 మంది అక్క‌డిక్క‌డే ప్రాణాలు వ‌దిలేశారు. వీరిలో 110 మందికి పైగా చిన్నారులు (విద్యార్థినులు) ఉన్నట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి నివేదికలు పేర్కొన్నాయి. చ‌నిపోయిన విద్యార్థినులంద‌రూ 7 నుంచి 12 ఏళ్ల మధ్య ఆడ‌పిల్ల‌లే. ఈ క్రూర ఘ‌ట‌న‌కు యావ‌త్ ప్ర‌పంచ చ‌లించిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ ను తిట్టిన తిట్టు తిట్ట‌నోళ్లు లేరు. మాన‌వ హ‌క్కు సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ఇక సీన్ క‌ట్ చేస్తే.. అస‌లు ఆప‌రేష‌న్ ఎథిక్ ప్యూరీలో.. ఈ పాఠ‌శాల‌నే ఎందుకు టార్టెట్ గా ఎంచుకున్నార‌ని ప్ర‌శ్నిస్తే..

4Mn Iran Women Fighters : అది బాసిజ్ యూనిట్‌..

4Mn Iran Women Fighters

అమెరికా రక్షణ శాఖ (Pentagon) ప్రాథమిక విచారణలో, ఈ పాఠశాలను పొరపాటున లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. పాత నిఘా సమాచారం (dated intelligence) ఆధారంగా, ఆ పాఠశాల భవనానికి సమీపంలోని IRGC (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) సైనిక స్థావరంగా భావించి క్షిపణి దాడి చేసినట్లు అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు ఘోషించాయి. కానీ.. ఇజ్రాయెల్ నిఘా సంస్థ ఈ ఫాఠ‌శాల‌ను బ‌సిజ్ శిక్ష‌ణ కేంద్రంగా గుర్తించింది. ఈ స‌మాచార‌మే ఇచ్చింది. అందుకే ఈ పాఠ‌శాల‌పై అమెరికా క్షిప‌ణి దాడి చేసింది. ఇదీ ఇరాన్ ప‌త్రిక‌ల ఆరోప‌ణ‌.

4Mn Iran Women Fighters : బాసిజ్ సిస్ట‌ర్స్ గురూ..

ఐఆర్జీసీ అనుబంధ సంస్థ బా సిజ్ అంటే.. బాల‌దండు అని అంద‌రికీ తెలుసు. ఇందులో కేవ‌లం మ‌గ‌పిల్ల‌ల్నే ఐఆర్జీసీ రిక్రూట్ చేస్తుంద‌ని భావిస్తారు. కానీ.. ఆడ‌పిల్ల‌లకూ బాసిజ్ సిస్ట‌ర్స్ గా.. తీసుకుంటుంది. ఇరాన్ సైనిక వ్యవస్థలో ఐఆర్జీసీ (IRGC) కి అనుబంధంగా మహిళా విభాగం ఉంది. ప్రధానంగా బాసిజ్ (Basij) అనే పారామిలిటరీ దళంలో మహిళలు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ బాసిజ్ దళంలో మహిళల కోసం ప్రత్యేక విభాగం ఉంది. ‘బాసిజ్ సిస్టర్స్’ (Basij Sisters) అని పిలుస్తారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, మొత్తం బాసిజ్ సభ్యులలో సుమారు 40 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరు ప్రధానంగా సామాజిక నియంత్రణ, నైతిక నిఘా , ప్రభుత్వ అనుకూల ప్రచారాల్లో పాల్గొంటారు. నిరసనల సమయంలో మహిళా నిరసనకారులను అదుపు చేయడానికి వీరిని రంగంలోకి దించుతారు. వీరికి ప్రాథమిక సైనిక శిక్షణ, రైఫిళ్లు వినియోగం, ఇస్లామిక్ సిద్ధాంతాలపై శిక్షణ ఇస్తారు.

4Mn Iran Women Fighters : గర్ల్స్​.. బాసిజ్

బాలుర తరహాలోనే పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే బాలికల కోసం కూడా బాసిజ్ విభాగాలు ఉన్నాయి. ప్యూపిల్స్ బాసిజ్’ (Pupil’s Basij) అని పిలుస్తారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను భావజాలపరంగా సిద్ధం చేయడానికి ఇది పనిచేస్తుంది. పాఠశాలల్లో మతపర కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వానికి విధేయులుగా ఉండేలా విద్యార్థినులను తీర్చిదిద్ద‌టం వీరి ముఖ్య ఉద్దేశ్యం.బాసిజ్‌లో చేరడం వల్ల ఉన్నత విద్య (యూనివర్సిటీ సీట్లు) ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యం త‌దిత‌ర ప్రయోజనాలు లభిస్తాయి.

4Mn Iran Women Fighters : కోవ్స‌ర్‌.. అల్-జహ్రా ప్ర‌త్యేకం

ఇరాన్‌లోని మహిళా బాసిజ్ విభాగంలో కోవ్సర్ (Kowsar), అల్-జహ్రా (Al-Zahra) బెటాలియన్లు ఉన్నాయి. ఒక్కో బెటాలియన్‌లో సుమారు 300 నుండి 350 మంది మహిళా సభ్యులు ఉంటారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, సుమారు 2,500 అషూరా (పురుషులు) . అల్-జహ్రా/ కోవ్సర్ (మహిళల) బెటాలియన్లు కలిపి ఉన్నాయి. అంతర్గత భద్రతను పర్యవేక్షించడం, నిరసనల సమయంలో మహిళా ఆందోళ‌న‌కారుల‌ను నియంత్రించడం వీరి ప్రధాన పని వీరికి తేలికపాటి ఆయుధాల (Light arms) వినియోగం , యుద్ధ తంత్రాల‌ను నేర్పుతారు. విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం సామాజిక ప్రచారాల్లో పాల్గొనడం వంటి బాధ్యతలు కూడా వీరు నిర్వహిస్తారు. 2026 నాటికి మ‌హిళ బాసిజ్ సభ్యత్వం పెరిగినట్లు సమాచారం. బాసిజ్ మహిళా విభాగంలో సుమారు 40 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారని అంచనా.

4Mn Iran Women Fighters : మ‌గాళ్ల‌తో స‌మానం

ఇరాన్ పారామిలిటరీ దళం (Basij) ఆధ్వర్యంలో 500 నుండి 1,000 వరకు) కోవ్సర్ , అల్-జహ్రా బెటాలియన్లు పనిచేస్తున్నాయి. ప్రధానంగా వైద్య సహాయం, విపత్తు నిర్వహణ సహాయక చర్యల కోసం శిక్షణ పొందిన మహిళా యూనిట్లు కోవ్సర్ బెటాలియన్ లో ఉంటాయి, భద్రత, నిరసనల అణిచివేత త‌దిత‌ర కార్యకలాపాల్లో అల్-జహ్రా బెటాలియన్లు: ప‌ని చేస్తాయి. వీటిని పురుషుల “అషూరా” బెటాలియన్లకు సమానంగా పరిగణిస్తారు.

4Mn Iran Women Fighters : తాజాగా న‌ర్సింగ్‌.. నిఘా

ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ ఈ మహిళా దళాలను సరిహద్దు భద్రత కంటే ఎక్కువగా అంతర్గత నిఘా మతపర నిబంధనల అమలు కోసం వినియోగిస్తోంది. మహిళా బాసిజ్ (Basij) వ్యవస్థలో అల్-జహ్రా (Al-Zahra) బెటాలియన్లు అత్యంత కీలక విభాగం. బాసిజ్ వ్యవస్థలో మొత్తం 2,500 అషూరా (పురుషుల) మరియు అల్-జహ్రా (మహిళల) బెటాలియన్లు ఉన్నాయి. ఇవి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వేలాది బాసిజ్ స్థావరాలలో (Paygah-e Basij) భాగంగా పనిచేస్తాయి. ప్రతి మున్సిపల్ జిల్లాలోని బాసిజ్ రెసిస్టెన్స్ బేస్ (BRB) లో సాధారణంగా రెండు పురుషుల అషూరా బెటాలియన్లు ఒక మహిళా అల్-జహ్రా బెటాలియన్ ఉంటాయి.

4Mn Iran Women Fighters : రాజకీయ హోదా

సంప్రదాయవాద సమాజంలో వీరిని “విప్లవ సంరక్షకులు”గా చూస్తారు. వీరికి సమాజంలో అధికారిక హోదా గౌరవం లభిస్తుంది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలకు బాసిజ్ ఒక బలమైన పునాదిగా మారుతుంది. పార్లమెంటు (Majlis) సభ్యులుగా ఎన్నికవడానికి ఇది సహాయపడుతుంది. వీరిని ఇస్లామిక్ విలువల రక్షకులుగా పరిగణిస్తారు. హజ్ యాత్ర వంటి మతపర పర్యటనలకు వెళ్లేటప్పుడు వీరికి ప్రభుత్వం నుండి ప్రత్యేక మద్దతు మరియు రాయితీలు లభిస్తాయి. ఈ ప్రయోజనాలు పొందడానికి ప్రభుత్వానికి సుప్రీం లీడర్‌కు పూర్తి విధేయులుగా ఉండాలి. ముఖ్యంగా నిరసనల సమయంలో ప్రభుత్వం చెప్పినట్లుగా వ్యవహరించడం తప్పనిసరి.

4Mn Iran Women Fighters : 46 ల‌క్ష‌ల మంది ..

ఇరాన్ అధికారిక గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు 1.4 కోట్ల మంది విద్యార్థులలో దాదాపు 46 లక్షల మంది బాసిజ్‌లో సభ్యులుగా ఉన్నారు.విద్యార్థి బాసిజ్ సభ్యులలో సుమారు 35% నుంచి 40% వరకు బాలికలు ఉంటారు. దాదాపు 16 లక్షల నుంచి 18 లక్షల మంది బాలికలు ఈ విభాగంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక పాఠశాల బాలికలు (8-12 ఏళ్లు).. మిడిల్ స్కూల్ బాలికలు (12-15 ఏళ్లు).హైస్కూల్ బాలికలు (15-18 ఏళ్లు).ప్రాయంలో బాసిజ్ విద్యార్థుల‌ను విభ‌జిస్తారు.

4Mn Iran Women Fighters : సైనిక ఫ్యాక్ట‌రీలు ఇవే

ఇరాన్ మొత్తం మీద సుమారు 1,50,000 పాఠశాలల్లో, దాదాపు 54,000 పాఠశాలల్లో బాసిజ్ కేంద్రాలు (Basij Units) ఏర్పాటు జ‌రిగింది. ఇటీవల ప్రాథమిక స్థాయి నుంచే బాసిజ్ సంస్కృతిని అలవాటు చేయడానికి కొత్తగా సుమారు 6,000 బాసిజ్ కేంద్రాలను ప్రైమరీ స్కూళ్లలో ప్రారంభించారు. ప్ర‌తి బాలికల పాఠశాలల్లో ఒక బాసిజ్ యూనిట్ ఉంటుంది, దీనిని ఒక మహిళా కమాండర్ పర్యవేక్షిస్తారు.

4Mn Iran Women Fighters : తీర్చి దిద్దుతారంతే..

మతపర పర్యవేక్షణ: పాఠశాలల్లో ఇస్లామిక్ డ్రెస్ కోడ్ (హిజాబ్) ఇతర నియమాలను విద్యార్థినులు పాటిస్తున్నారో లేదో వీరు పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ అనుకూల భావజాలాన్ని, విప్లవ సిద్ధాంతాలను విద్యార్థుల్లో ప్రచారం చేస్తారు. వేసవి శిబిరాల్లో వీరికి ప్రాథమిక సైనిక శిక్షణ సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, పాఠశాలలనే సైనిక కేంద్రాలుగా కూడా వాడుకుంటున్నట్లు కొన్ని అంతర్జాతీయ నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

4Mn Iran Women Fighters : విప్లవ వ‌నితల ఆవిర్భావం.

బాసిజ్ సిస్ట‌ర్స్ అంటే.. ఇరాన్ లో త‌ర‌త‌రాల రాచ‌రికం పీడ‌న‌కు వ్య‌తిరేకంగా పేద‌రికం గుండెల్లో ఉద్భ‌వించిన ఇస్లామిక్ విప్ల‌వంలో.. మ‌హిళ‌లూ భాగం పంచుకున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బసిజ్ సిస్టర్స్ (Basij-e Khaharan) విభాగాన్ని అధికారికంగా 1981లో ప్రారంభించింది. 1979లో అయతుల్లా ఖొమేనీ ‘బసిజ్’ (మొబిలైజేషన్ ఆఫ్ ది అప్రెస్డ్) అనే పౌర స్వచ్ఛంద దళాన్ని ఏర్పాటు చేశారు. 1980లో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో మహిళలు కూడా సహాయం చేయడానికి ఆసక్తి చూపారు. 1981లో ‘డిప్యూటీ ఆఫ్ ది సిస్టర్స్ బసిజ్’ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఇరాన్ యుద్ధ చరిత్రలో కీలక మ‌హిళ నాయ‌కురాలు మర్జీయే దబ్బగ్ (Marziyeh Dabbagh) ఈ విభాగాన్ని స్థాప‌న‌కు ముఖ్య పాత్ర పోషించారు. యుద్ధ క్షేత్రాల్లో నర్సులుగా, గూఢచారులుగా మద్దతు దళాలుగా పనిచేశారు. కాలక్రమేణా వీరు సామాజిక నైతిక పోలీసింగ్ (Morality Policing) విధులను కూడా చేపట్టారు.1985లో ఖొమేనీ ఆదేశం ప్రకారం, దేశ రక్షణలో పురుషులకు తోడుగా మహిళలకు కూడా తప్పనిసరిగా సైనిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

Leave a Reply