45th Division | నల్లగొండ మేయర్గా…

45th Division | నల్లగొండ మేయర్గా…
45th Division | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ గా 32 వ వార్డు కార్పొరేటర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా 45వ డివిజన్ కార్పొరేటర్ ఎండి అష్రఫ్ అలీ మహమ్మద్ ఎన్నికయ్యారు. సోమవారం నల్లగొండ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మేయర్, డిప్యూటీ మేయర్ లతో పాటు 48 డివిజన్ల కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హాజరయ్యారు. స్పెషల్ ఆఫీసర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ మేయర్, డిప్యూటీ మేయర్లతోపాటు కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

