మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖ

పెద్దపల్లి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ, ఈ నెల 18న నిర్వహించే ‘బీసీ బంద్‌’ను జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనతో కూడిన లేఖను విడుదల చేశారు.

ఈ లేఖలో జగన్.. కేంద్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కలిసి పోరాడాలని కోరారు. అలాగే, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు ఏకమై ఆర్‌ఎస్‌ఎస్ (RSS), బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గట్టి ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

బీసీ సంఘాలు చేపట్టిన ఈ ‘బీసీ బంద్‌’కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఆ లేఖలో స్పష్టం చేశారు.

Leave a Reply