నిషేధిత గడ్డి మందును వాడొద్దు

నిషేధిత గడ్డి మందును వాడొద్దు
ఎంఏఓ అంజిత్ కుమార్
జన్నారం, ఆంధ్రప్రభ : నిషేధిత గడ్డి మందును రైతులు ఎవరు వాడకూడదని స్థానిక ఇన్చార్జి ఎంఏఓ గొర్ల అంజిత్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని 12 పురుగుమందుల షాపుల్లో గురువారం తనిఖీలు నిర్వహించి, 402 లీటర్లు ప్రభుత్వం నిషేధించిన పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలను ఆయన నిలిపివేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఆ గడ్డి మందును 60 రోజులపాటు రాష్ట్రంలో అమ్మకూడదని నిషేధం విధించిందన్నారు. దొంగ చాటుగా ఆ గడ్డి మందును ఎవరైనా అమ్మినా, కొన్నా చట్ట పరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు.
