4000 Luxury Cars Stuck : కెన్యాలో కార్ల జాతర ..Andhra Prabha SPL News

4000 Luxury Cars Stuck : కెన్యాలో కార్ల జాతర ..Andhra Prabha SPL News

  • జెబెల్ అలీ పోర్ట్‌పై దాడి ఫలితం
  • కార్ల రవాణాకు అంతరాయం
  • జపాన్ కార్లకు…
  • లాము ద్వీపంలో తాత్కాలిక నిలయం
  • లాము పోర్ట్‌కు ఇదొక వరం
  • దుబాయ్​ వాలా ల‌బోదిబో
  • క్యూలో మ‌రో 5000 కార్లు

( ఆంధ్ర‌ప్ర‌భ‌, నైరోబి ప్ర‌తినిధి )

4000 Luxury Cars Stuck

4000 Luxury Cars Stuck : ప‌శ్చిమ ఆసియాలో యుద్ధం పుణ్య‌మాని.. దుబాయ్‌కి చేరాల్సిన వేలాది ఖరీదైన కార్లు కెన్యాలోని లాము (Lamu) ద్వీపంలో చిక్కుకుపోయాయి. ఇరాన్ ఇజ్రాయెల్/అమెరికా మధ్య ఉద్రిక్తతల నేప‌థ్యంలో ఇటు హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత .. అటు దుబాయ్‌లోని కీలక జెబెల్ అలీ (Jebel Ali) పోర్ట్ పై వైమానిక దాడుల‌తో…

4000 Luxury Cars Stuck

వివిధ దేశాలు త‌మ నౌకలను సురక్షిత ప్రదేశాలకు మళ్లించారు. జపాన్ నుంచి యూఏఈకి వెళ్తున్న సుమారు 4,000 పైగా లగ్జరీ కార్ల‌ను లాము పోర్ట్‌లో అన్‌లోడ్ చేశారు. . వీటిలో మెరిసే పోర్షే (Porsche) త‌దిత‌ర అత్యంత ఖరీదైన బ్రాండ్ల కార్లు కూడా ఉన్నాయి. యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన లాము ద్వీపంలోని గిడ్డంగులు పార్కింగ్ స్థలాలు ఇప్పుడు ఈ ఈ కార్లతో కిక్కిరిసి పోయాయి. పరిస్థితులు కుదుటపడే వరకు ఇవి అక్కడే ఉంటాయని పోర్ట్ అధికారులు తెలిపారు.

4000 Luxury Cars Stuck : క్యూలో మ‌రో నౌక

ఇప్పటికే ఈ ద్వీపంలో సేదతీరుతున్న 4,000 కార్లకు తోడు, మరో 5,000 కార్లతో ఇంకొక నౌక కూడా లాము పోర్ట్‌కు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

4000 Luxury Cars Stuck

లాము పోర్ట్ మేనేజర్ అబ్దుల్ అజీజ్ మజీ ప్రకారం, యుద్ధం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, వాణిజ్యపరంగా ఈ మళ్లింపు లాము పోర్ట్‌కు ఒక “వరంగా” మారింది. అంతర్జాతీయ సరఫరా గొలుసు (Supply Chain) తీవ్రంగా దెబ్బతిని, డెలివరీల్లో భారీ జాప్యం జరుగుతోంది.ఈ పరిస్థితుల దృష్ట్యా, కార్ల డెలివరీ ఎప్పుడు పునరుద్ధరించబడుతుందో ఖచ్చితంగా తెల‌స‌లేని స్థితి ఏర్ప‌డింది.

ALSO READ : Australia Fuel Crisis 26 : ఆస్ట్రేలియా లో నోస్టాక్ Andhra Prabha News

Leave a Reply