బాబు జగ్జీవన్ రాం ఆశయాలను కొనసాగిద్దాం.

బాబు జగ్జీవన్ రాం ఆశయాలను కొనసాగిద్దాం.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం.
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : బాబు జగ్జీవన్ రాం 119 వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణం శివారులో గల బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఘనంగా పుష్పాంజలు ఘటించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షులు జంజిరాల నాగరాజు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రాం ప్రముఖ స్వాతంత్ర యోధుడు, గొప్ప సంఘసంస్కర్త, గొప్ప రాజకీయవేత్త భారత పార్లమెంటులో 40 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా భారత ఉప ప్రధానిగా తన యొక్క సేవలను అందించారు.
ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ మండల అధ్యక్షులు మెరుగు రమేష్, పెద్ద వంగర మండల అధ్యక్షులు కోడూరు మధు రెడ్డి, దంతాలపల్లి మండల ప్రధాన కార్యదర్శి అ మరగొండ మహేందర్, గూడూరు మండల కార్యదర్శి లింగాల మణి, చకినాల సునీల్ తదితరులు పాల్గొన్నారు.
