ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తాం

నస్పూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణంలో 34వ, 36వ డివిజన్ కాంగ్రేస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు అగల్ డ్యూటీ రాజు, రాణి దంపతులు ప్రచారంలో దూసుకు పోతున్నారు. డీసీసీ జిల్లా మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అభివృద్ధి పథంలో మనం కూడా భాగస్వాములు అవుతాం, వార్డులోని రోడ్డు, మంచినీటి, విద్యుత్, డ్రైనేజీ సమస్యలు ఉన్న గెలిచిన అనంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో అగల్ డ్యూటీ దంపతులను గెలిపించాలని వార్డ్ ప్రజలను ఈ సందర్భంగా కోరారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, పోటీ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
