
సమగ్ర అభివృద్ధి బీజేపీ నినాదం
సమగ్ర అభివృద్ధి బీజేపీ నినాదం
- 33 వ వార్డు బిజెపి అభ్యర్థి ఖమ్మం సురేందర్
నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : సర్వ సమగ్ర అభివృద్ధి బిజెపి నినాదం అని నిర్మల్ మున్సిపల్ పరిధిలోని 33 వార్డుల్లో బిజెపి కౌన్సిలర్ అభ్యర్తి ఖమ్మం సురేందర్ శనివారం భాగ్యనగర్ లో ఇంటింటాప్రచార కార్యక్రమాన్ని చేపట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకొని కమలం పువ్వు గుర్తుకు ఓటు ఇవ్వాలని అభ్యర్థించారు . కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే మోదీ సారధ్యానికి మద్దతుగా బిజెపి కౌన్సిలర్ అభ్యర్తి గా ప్రజలు గెలిపిస్తారన్న ధీమా తమకు ఉందని అయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సహకారంతో భాగ్యనగర్ కాలానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పాదంలో నడిపిస్తానని ఓటర్లకు చెప్పారు
