ప్రజారోగ్యమే లక్ష్యం

కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ వెల్లడి

( కర్నూలు ,  ఆంధ్రప్రభ)  

ప్రజారోగ్య పరిరక్షణే నగరపాలక సంస్థ ప్రధాన ధ్యేయమని కమిషనర్ పి. విశ్వనాథ్ ( Kurnool carporation commissioner)  పేర్కొన్నారు. నగర పారిశుద్ధ్యాన్ని శక్తివంతం చేసే క్రమంలో పాత బస్టాండ్ పరిసరాల్లో శుక్రవారం పారిశుద్ధ్య సిబ్బందికి కొత్తగా కొన్న 3,205 డస్ట్‌ బిన్‌లను (dust bins)  పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య వ్యవస్థను ఆధునీకరించేందుకు, ప్రతి మైక్రో ప్యాకేట్‌ (micro packet) వద్ద శుభ్రత ప్రమాణాలు మెరుగుపడేలా కొత్త డస్ట్‌బిన్‌ల కొనుగోలు చేపట్టామని తెలిపారు. నగరంలో 490 మైక్రో ప్యాకేట్‌ల పరిధిలో అవసరాన్ని బట్టి ఆరు చొప్పున డస్ట్‌బిన్‌లు అందజేస్తున్నట్లు చెప్పారు. శుభ్రత సేవలను సమర్థంగా నిర్వహించేందుకు సిబ్బందికి పనిముట్లు, అవసరమైన సాధనాలను సమకూర్చేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నాణ్యమైన పారిశుద్ధ్య సేవలను అందించడంలో నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని కమిషనర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి బి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply