పల్లా సహకారం తో అభివృద్ధి బాధ్యత మాది …

పల్లా సహకారం తో అభివృద్ధి బాధ్యత మాది …

30 వార్డులో గెలుపే ధ్యేయంగా బీఆర్ఎస్ అభ్యర్థి జెరిపోతుల కుమార్ …

జనగామ: ఫిబ్రవరి 9 (ఆంధ్రప్రభ): మున్సిపాలిటీ 30 వ వార్డులో గెలిపించే బాధ్యత వార్డు ప్రజల దని, ఎమ్మెల్యే పల్లా తో అభివృద్ధి చేసే బాధ్యత మాదని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జెరిపోతుల కుమార్ అన్నారు. సోమవారం ఇంటింటా ప్రచార పర్వంలో ముందంజలో కొనసాగుతున్నారు. తనకు ఒక్క సారి అవకాశం కల్పించి 30 వ వార్డు కౌన్సిలర్ గెలిపిస్తే వార్డులో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని ఓటర్లకు విన్నవిస్తున్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తను కౌన్సిలర్ గెలిస్తే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో
వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య నిర్వహణ వీధి దీపాలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, సీసీ రోడ్లు డ్రైనేజీ వసతి, తాగునీటి సౌకర్యం తో పాటు మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తామని హామీ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే వార్డులో వందలాది మంది మహిళల ఓటర్లతో నిత్యం ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఎక్కడ విన్నా జేరిపోతుల కుమార్ గెలుపుపై జోరుగా చర్చలు వినిపిస్తున్నాయి. 30వ వార్డులో జేరిపోతుల కుమార్ కౌన్సిలర్ గా బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు తధ్యమని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మామిడి ఐలయ్య, గంధ మల్ల నరేందర్, సిద్ధార్థ గౌడ్,నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply