300 people | వృద్ధ ఓటర్లకు చేయూత..

300 people | వృద్ధ ఓటర్లకు చేయూత..

  • మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్
  • బెల్లంపల్లిలో పోలీసుల సేవాభావం

300 people | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బెల్లంపల్లిలో పోలీసులు భద్రతా విధులతో పాటు మానవీయ సేవలతో ప్రశంసలు అందుకుంటున్నారు. పట్టణంలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద సుమారు 300 మంది పోలీసులు, ఎస్ అండ్ పీసీ, అటవీ శాఖ సిబ్బంది విధుల్లో పాల్గొంటూ వృద్ధులు, వికలాంగ ఓటర్లకు సహాయపడుతున్నారు.

నడవలేని స్థితిలో ఉన్న ఓటర్లను వీల్‌చైర్ల సాయంతో పోలింగ్ బూత్‌లకు తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరిస్తున్నారు. ఈ క్రమంలో ఒక వృద్ధుడిని కానిస్టేబుల్ జిల్లపల్లి సత్యం స్వయంగా వీల్‌చైర్‌లో నెట్టుకుంటూ పోలింగ్ బూత్‌లోపలికి తీసుకెళ్లిన దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగంలో పోలీసులు చేస్తున్న ఈ సేవలను ఓటర్లు, పట్టణ ప్రజలు ప్రశంసిస్తూ, “పోలీసులు కేవలం శాంతిభద్రతలకే కాదు.. సేవాభావానికీ ప్రతీకలు” అని కొనియాడారు.

300 people |

Leave a Reply