3 Indonesia Peacekeepers Killed : లెబనాన్​ లో బలి Andhra Prabha News

3 Indonesia Peacekeepers Killed : లెబనాన్​ లో బలి Andhra Prabha News

  • హిజ్బల్లా.. ఇజ్రాయెల్​ వార్​
  • శాంతి కాముకులపై దాడులు
  • ఐక్యరాజ్య సమితి ఖండన

(ఆంధ్రప్రభ, బీరూట్​ ప్రతినిధి)

3 Indonesia Peacekeepers Killed : దక్షిణ లెబనాన్‌లో శాంతి పరిరక్షక విధుల్లోని ఇద్దరు ఇండోనేషియా సైనికులు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం (UNIFIL) ధృవీకరించింది. సోమవారం సాయంత్రం దక్షిణ లెబనాన్‌లోని బని హయ్యాన్ (Bani Hayyan) మున్సిపాలిటీ సమీపంలో ఒక లాజిస్టిక్స్ కాన్వాయ్ ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అకస్మాత్తుగా పేలుడు సంభవించటంతో ఈ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ పేలుడుకు ఖచ్చిత కారణం ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని UNIFIL ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు శాంతి పరిరక్షకులు కూడా గాయపడ్డారు, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు కొన్ని గంటల ముందే, అడ్చిత్ అల్-ఖుసైర్ (Adchit al-Qusayr) గ్రామ సమీపంలో జరిగిన మరో దాడిలో ఇండోనేషియా శాంతి పరిరక్షకుడు జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. కేవలం 24 గంటల వ్యవధిలో ముగ్గురు ఇండోనేషియా సైనికులు మరణించడం గమనార్హం.

ప్రస్తుతం ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరుగుతున్న భీకర పోరు కారణంగా ఈ ప్రాంతంలో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. శాంతి పరిరక్షకుల పైనా దాడులు పెరుగుతున్న తరుణంలో ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఈ దాడులపై UNIFIL దర్యాప్తు చేస్తోంది. యుద్ధంలోని అన్ని పక్షాలు శాంతి పరిరక్షకుల భద్రతను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి కోరింది.

Leave a Reply