2manypieces | ఎందుకీ దారుణాలు? భయంకర హత్యల వెనుక నిజాలు

2manypieces | ఎందుకీ దారుణాలు? భయంకర హత్యల వెనుక నిజాలు

2manypieces | మంటకలిసిపోతున్న మానవత్వం
క్షణికావేశంలో క్రూరంగా చంపేస్తున్నారు
దారుణ హత్యలకు ఒడిగడుతున్నారు
సమస్య వస్తే చంపడమేనా..?
ఆడ,మగ సంబంధాలకు విలువేది?

2manypieces | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మానవత్వం మంటగలిసిపోతోంది. మానవ సంబంధాలు కాలి బూడిదైపోతున్నాయి. మానవత్వం మరిచిన కొందరు విచక్షణ కోల్పోయి దారుణాలకు ఒడికడుతున్నారు. క్షణికావేశం, కక్షలు తదితర కారణాలతో క్రూరమైన హత్యలు చేయడానికి తెగబడుతున్నారు. కారణమేదైనా కాల్చేయడం, ముక్కలుగా నరకడం.. ఇలా అమానుష హత్యలకు పాల్పడుతున్నారు. హత్య చేసిన తర్వాత మృతదేహాలను మాయం చేయడానికి, కేసుల నుంచి తప్పించుకోవడానికి వివిధ పన్నాగాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే హత్య చేసిన తర్వాత మృతదేహాలను కాల్చేయడం, ముక్కలు చేసేయడం, కుక్కర్‌లో ఉడికించడం… ఇలా దారుణాలకు పాల్పడుతున్నారు.

2manypieces
2manypieces

సమాజంలో ఇటీవలి కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో జరుగుతున్న హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక వ్యక్తిని నమ్మి దగ్గరకావడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాల కారణంగా ఘోరమైన హత్యలకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవాలి కానీ ప్రాణాలు తీయడమే పరిష్కారం అని భావించడం సరైంది కాదు. ప్రేమ పేరుతో దగ్గర కావడం, పెళ్లి అయినా వేరే వారితో సంబంధాలు పెట్టుకోవడం లాంటివి ఇటీవలి సమాజంలో పెరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి వారి మధ్య ఏ చిన్న పొరపాటు జరిగినా ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. వీళ్లందరేమైనా అవివేకులంటే కాదండీ.. ఉన్నత విద్యావంతులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సైతం ఇలాంటి నేరాలకు పాల్పడటం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించకపోతే మున్ముందు మరిన్ని దారుణ సంఘటనలు చూడాల్సి వస్తుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే కొన్ని దారుణ హత్యలు సమాజాన్ని వణికిస్తున్నాయి. ఇలాంటి ఘోరమైన హత్యలు కూడా చేస్తారా అనేలా కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఉదంతం దేశాన్ని ఎంతలా వణికించిందో మనందరికీ తెలుసు. అదే తరహాలో విశాఖపట్నంలోని గాజువాకలో ఒక ప్రియురాలు తన ప్రియుడి చేతిలోనే దారుణంగా హత్యకు గురవ్వడం, ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచడం ఘటన సమాజం ఎటు పోతుందో అని భయమేస్తోంది.

2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దారుణమైన హత్యోదంతం శ్రద్ధా వాకర్ కేసు. ఢిల్లీలో తన లివ్-ఇన్ భాగస్వామి అఫ్తాబ్ అమీన్ పూనావాలా, శ్రద్ధాను గొంతునులిమి చంపి, మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో దాచి, రోజుల తరబడి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పారేశాడు. 2022 మే 18న నిందితుడు అఫ్తాబ్, శ్రద్ధాను చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి, వాటిని 300 లీటర్ల ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఇలాంటి సంఘటనే విశాఖపట్టణం గాజువాక ప్రాంతంలో జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

నిందితుడు రవీందర్, తన ప్రియురాలు మౌనికను చంపడమే కాకుండా, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించాడు. మౌనిక శరీర భాగాలను ముక్కలుగా నరికి కొన్నింటిని ఫ్రిజ్‌లో దాచగా, మిగిలిన సగ భాగాన్ని ఒక గోనె సంచిలో కుక్కి బయట పారేసేందుకు సిద్ధం చేశాడు. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రవీందర్, నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి ఇంతటి అమానుషానికి ఒడిగట్టడం గమనార్హం.

విశాఖపట్టణంలోని ఎల్వీ నగర్‌లో విజయనగరం రాజాంకు చెందిన 35 ఏళ్ల రవీంద్ర నేవీలో టెక్నీషియన్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి కొన్ని నెలల క్రితం పెళ్లయ్యింది. ఐతే అంతకుముందే మౌనిక అనే యువతితో సన్నిహిత సంబంధం ఉంది. భార్యను పుట్టింటికి పంపించిన రవీంద్ర తన మాజీ ప్రియురాలు మౌనికను ఇంటికి పిలిచాడు. అర్థరాత్రి దాటాక ఆమెను కత్తితో నరికి హత్య చేశాడు. ఆపై ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఎలాగూ పోలీసులకు దొరికిపోతానని అతడే నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి నిజం చెప్పేశాడు. తనను తన మాజీ ప్రియురాలు తరచూ డబ్బు కోసం వేధిస్తోందని, అందువల్ల ఆమెను హత్య చేసినట్లు పోలీసులతో చెప్పాడు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతురాలి శరీర భాగాలున్న రెండు మూటలను కనుగొన్నారు. ఐతే ఆమె తల భాగాన్ని బ్యాగులో పెట్టుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి తగులబెట్టినట్లు నిందితుడు చెప్పాడు. ఐతే నిందితుడు చెప్పిన వివరాల్లో ఎంతవరకు నిజం ఉందన్న విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

click here to read more

click here to read more crime news

Leave a Reply