299 TMC water | కాళేశ్వరం పూర్తి చేయడం కేసీఆర్ నిబద్ధత…

299 TMC water | కాళేశ్వరం పూర్తి చేయడం కేసీఆర్ నిబద్ధత…
- 70 ఏళ్ల నుంచి వింటున్న పోలవరం ఇంకా పూర్తి కాలేదు
- నీళ్ల సబ్జెక్ట్ నాలుగు రోజులు చదివితే రాదు… రాష్ట్రం పైన ప్రేమ ఉండాలి!
- శాసన సభలో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్
299 TMC water | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పోలవరం ప్రాజెక్టు కోసం 70 ఏళ్లుగా వింటున్నామని, ఇంతవరకూ పూర్తి కాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) కేసీఆర్ హయాంలో పూర్తయిందని, ఇదే ఆయన నిబద్ధత అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ చేశారు. కేటీఆర్ ప్రసంగం ఇలా సాగింది…
ఎవరు ప్రాజెక్టులు కట్టినా తాగునీటి అవసరాల పేరుతోనే ప్రాజెక్టులు కట్టడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత అన్ని అనుమతులు తీసుకురావడం అనవాయితీ, కానీ ఈ విషయాన్ని ఎవరు చెప్పరు.
పోలవరం ప్రాజెక్టు కోసం 70 ఏళ్లు(70 years) నుంచి వింటున్నా కానీ పూర్తి కాలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కేసీఆర్ హయాంలో పూర్తి చేశారు. ఇది కేసీఆర్ నిబద్ధత. కాలంతో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. కాళేశ్వరంలో రంద్రానేషణ చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. రాజకీయ పరంగా మాకు నష్టం రాదు.
ప్రజలకు తెలులసు నీళ్లు ఇచ్చింది ఏవరో.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఒప్పుకుంటే నష్టం చేసినట్టే, 299 టీఎంసీ(299 TMC)లు ఒప్పుకుంది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే, దాని పైననే మా ప్రభుత్వం మరిన్ని కేటాయింపుల కోసం అడిగినం, పాలమూరు ప్రాజెక్టును సీఎం రేవంత్ కావాలనే పండపెట్టిండు, ప్రాజెక్టు కడితే కేసీఆర్‌కు పేరు వస్తుంది… ఆయన పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుంది.. కృష్ణ నది నుంచి నీళ్లు తీసుకుంటే బాబుకు కోపం వస్తుంది. అందుకే ప్రాజెక్టును పండబెట్టి.. కాలువలు కూడా తర్వడం లేదు. రేవంత్ అవినీతి అక్రమాలు ఆపినందుకే రేవంత్ బూతులు మాట్లాడుతున్నారు.
నన్ను అంటే ఏమాత్రం రేస్పాండ్ కాను.. కాని మా నాన్నను అంటే ఉర్కోనేది లేదు. నీళ్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్(press meet) కే అల్లాడతున్నారు. అట్లాంటిది కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మని డిమాండ్ చేస్తున్నారు. నీళ్ల సబ్జెక్ట్ నాలుగు రోజులు సదివితే రాదు… రాష్ట్రం పైన ప్రేమ ఉండాలి…
పంచాయతీలలో మా పార్టీ గొప్ప రిజల్ట్జ్ వచ్చాయి. రెండేళ్లల్లోనే కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకత ఎదుర్కొంది. సీఎం చెప్పిన జాబితాలోనే ఇతర పార్టీల సర్పంచ్ లను కలుపుకున్నారు. సీఎం కృష్ణా నది ఏ బేసిన్, ఎక్కడ ఉన్నది అడిగాడు. బాక్ర నంగాల్ ఏ రాష్ట్రంలో ఉన్నదో తెల్వని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy).
పాలమూరు రంగారెడ్డి అడ్డుకున్న వ్యక్తి ఇవాళ నీటిపారుదల శాఖ సలహా దారు. వీళ్ళు నీటిపారుదల శాఖ పై చర్చ అంటున్నారు. దేనిమీద చర్చ పెడుతున్నారో తెల్వదు. నీటిపారుదల శాఖ పై కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారు. కేసీఆర్ వస్తున్నాడు అని చర్చకు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు.
