2800 Crore | రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చని కాంగ్రెస్

2800 Crore | రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చని కాంగ్రెస్
- ప్రభుత్వ మెడలు వంచుతాం : బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి
2800 Crore | నల్లగొండ, ఆంధ్రప్రభ : రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Govt) మెడలు వంచుతామని బీజేపీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Eleti Maheshwar Reddy) అన్నారు. బీజేపీ పిలుపుమేరకు ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన 26 గంటల రైతు నిరాహార దీక్ష విరమణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు రాకముందు ఎన్నో హామీలు ఇచ్చి నేడు రైతు సమస్యలను పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. అన్ని పంటలకు రైతు బోనస్(Rythu Bonus) కల్పిస్తామని చెప్పి నేడు సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామనడం సిగ్గుచేటన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2800 కోట్ల(2800 Crore Statewide) రూపాయల కుంభకోణం జరిగిందని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. జిల్లా మంత్రులు కుంభకోణాలకు పాల్పడిన ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదని అన్నారు.

