24వ వార్డులో హస్తం జోరు

24వ వార్డులో హస్తం జోరు
ప్రచారంలో దూసుకుపోతున్న కొట్టె స్వరూప సదానందం
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులో హస్తం జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొట్టె స్వరూప సదానందం ప్రచారంలో ముందు వరుసలో నిలిచి ప్రతిపక్షాలను వెనక్కి నెట్టారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు,వార్డు ప్రజలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి, మీ అమూల్యమైన ఓటు చేయి గుర్తుపై వేసి, తనను కౌన్సిలర్ గా గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొట్టే స్వరూప సదానందం మాట్లాడుతూ… ఎమ్మెల్యే విజయ రమణారావు బలపరిచిన అభ్యర్థిగా పెద్దపల్లి మున్సిపల్ 24 వ వార్డ్ నుండి మీ ముందుకు వస్తున్నానని, నన్ను ఆశీర్వదించి చేయి గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుండి మంచి స్పందన లభించిందన్నారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను కౌన్సిలర్ గా, భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వార్డు ప్రజలు మాట్లాడుతూ… 24వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీలో ఉన్న కొట్టే స్వరూపక్కను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని, ఎవరు ఎన్ని ప్రలోభాలు చేసినా ఓటు మాత్రం కొట్టే స్వరూప సదానందంకే వేస్తామని స్పష్టం చేశారు.
