
22వ వార్డులో బిఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం
వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 22వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి ఏర్వ అరుణ మెకానిక్ శ్రీనివాసులు గురు వారం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. కాలనీలోని ప్రధాన వీధుల గుండా పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి ఓటర్లను కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.తన అభ్యర్థిత్వాన్ని బలపర్చి గెలిపిస్తే వార్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అరుణ మెకానిక్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మద్దతుదారులు భారీగా తరలివచ్చి ర్యాలీ నిర్వహించగా మహిళలు బొడ్డెమ్మలు కోరుతూ అభ్యర్థికి మద్దతు పలుకుతూ కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. తనని గెలిపిస్తే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని అభ్యర్థి తెలిపారు.
