22nd Ward | ‘పరకాల మున్సిపల్ ‘ వైస్ చైర్మన్ పీఠంపై…

22nd Ward | ‘పరకాల మున్సిపల్ ‘ వైస్ చైర్మన్ పీఠంపై…
22nd Ward | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ బరితంగా జరిగిన వేళ అధిక కౌన్సిలర్ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను క్యాంపుకు తీసుకెళ్లింది వెళ్ళింది విధితమే. పరకాల మున్సిపల్ ఎన్నికలు పోలింగ్11వ తేదీ జరుగగా 13 వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరిగింది. ఈ ఫలితాలలో పరకాల మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి మొత్తం 22 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ13, బీఆ ర్ఎస్ పార్టీ 6, బీజేపీ పార్టీ 3 వార్డులను కైవసం చేసుకున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నుండి ముందుగానే చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించుకున్న పావుశెట్టి సునీల్ కుమార్కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో 16వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన బండి శ్రీధర్ కు పరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈనెల 16వ తేదీన పరకాల మున్సిపల్ పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమం ఖరారు చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలపై క్యాంపులో నిర్ణయించుకుని వచ్చి ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం బండి శ్రీధర్ కు దక్కే అవకాశాలు ఉన్నాయని సాంకేతాలు వినపడుతున్నాయని పలు ఊహాగానాలు వినవస్తున్నాయి.
