21వ డివిజన్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎడ్ల శంకర్ ని గెలిపించండి

మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు

ప్రజల కష్టాలు తెల్సిన వాడిని ప్రజా సమస్యలు తీర్చేవాడిని..!

ఆశీర్వదించి గెలిపిస్తే మీ బిడ్డగా అభివృద్ధి పరుస్తా..!

21 డివిజన్ బిఆర్ఎస్ అభ్యర్ధి
న్యాయవాది ఎడ్ల శంకర్

మంచిర్యాల ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ)ప్రజల కష్టాలు తెల్సిన వాడిని ప్రజా సమస్యల తీర్చేవాడిని నన్ను 21డివిజన్ లో ఆదరించి మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదిస్తే మీ బిడ్డగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తానని న్యాయవాది ఎడ్ల శంకర్ అన్నారు. బుధవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 21 డివిజన్లో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపిన దివాకర్ రావు పాల్గొని ప్రచారాన్ని ప్రారంభించారు.బి ఆర్ ఎస్ పార్టీని నమ్ముకొని నికార్సైన కార్యకర్తగా ఉన్న తనకు పార్టీ అధిష్టానం గుర్తించడం సంతోషకరమన్నారు.


తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి కార్పొరేటర్ గా గెలిపిస్తే దివాకర్ రావు సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి,21వ డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని,ఫిబ్రవరి 11 న జరిగే ఎన్నికల్లో కారు గుర్తు పై ఓటేసి ఓటర్లు తనను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు.నా అర్దాంగి ఎడ్ల లలిత ఈ ప్రాంతంలో నిస్వార్ధమైన సేవను పూర్తి చేసుకున్న చరిత్ర ఉందని. ఈ ప్రాంతంలో పుట్టి న్యాయవాదిగా సేవలందిస్తున్నటువంటి నేను పుట్టి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని. 21 డివిజన్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రేమా పూర్వకమైన సంబంధాలు ఉన్నాయని మీరందరూ చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.తాను ఇప్పటికే ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొని నిరుపేదలకు సేవలు అందిస్తున్నానని అన్నారు. ఈ ప్రచారంలో 21వ డివిజన్ బీఆర్ఎస్ ఇంచార్జ్ నజీర్, నాయకులు మహేందర్, ఉమాకాంత్,పద్మారావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply