216 National | ప్రమాదం వద్దు… ప్రాణం ముద్దు…

216 National | ప్రమాదం వద్దు… ప్రాణం ముద్దు…

  • రహదారి భద్రతపై పెడన పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం…

216 National | పెడన – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పెడన అదనపు ఎస్ఐ షేక్ బషీర్ ఆధ్వర్యంలో మచిలీపట్నం–కత్తిపూడి 216 జాతీయ రహదారిపై పెడన తోటమూల సెంటర్ వద్ద ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గతంలో ప్రమాదానికి గురైన వాహనాన్ని రహదారి పక్కన ఏర్పాటు చేసి, ప్రమాదాల తీవ్రతను వాహనదారులు ప్రత్యక్షంగా గమనించేలా చేశారు. ప్రమాదాల వల్ల కలిగే ప్రాణనష్టం, కుటుంబాలపై పడే భారాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా పోలీసులు వివరించారు. పోలీసులు వాహనదారులకు వేగ నియంత్రణ పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించడం వంటి ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. నిర్లక్ష్యం క్షణాల్లోనే ప్రాణాపాయం కలిగిస్తుందని, జాగ్రత్తగా ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

Leave a Reply