డిప్యూటీ సీఎం మల్లు బట్టి రోడ్ షోకు..

డిప్యూటీ సీఎం మల్లు బట్టి రోడ్ షోకు..
డాక్టర్’తో కలసి కదిలిన వందలాది కార్యకర్తలు…
ఆరో వార్డు నుండి ప్రదర్శనగా అయ్యప్ప ఆలయం వరకు..
జై కాంగ్రెస్ నినాదాలతో..
కదం తొక్కిన కాంగ్రెస్ జెండా…
వైరా, ఆంధ్రప్రభ : వైరాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రోడ్ షో ప్రచార కార్యక్రమానికి ఆరో వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డాక్టర్ కాపా మురళీకృష్ణ సతీమణి డాక్టర్ చంద్రకళ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలతో ర్యాలీ ప్రదర్శనగా అయ్యప్ప ఆలయం వద్దకు చేరుకున్నారు… జై కాంగ్రెస్ నినాదాలతో.. డప్పు శబ్దాలతో కోలాటాల నడుమ.. ర్యాలీ ప్రదర్శన లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది… ఆరో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కాపా చంద్రకళ, 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండ్రు వరలక్ష్మి లకు మద్దతుగా… పలువురు ప్రముఖులు ఈ ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేశారు… తొలివతగా 6,20 వార్డుల్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేశారు… డిప్యూటీ సీఎం రోడ్ షోలో పాల్గొనేందుకు ఉత్సాహంగా రెండు వార్డుల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లు స్వచ్ఛందంగా కదం తొక్కారు… ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, ప్రముఖ కంటి వైద్యులు ఉండు శ్యాంబాబు, లగడపాటి ప్రభాకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..
