2027 world cup| ఈసారి వదిలేదు లే..

2027 world cup| ఈసారి వదిలేదు లే..
2027లో వన్డే వరల్డ్ కప్ గెలుస్తాం..
టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సౌతాఫ్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2027ను గెలిచి తీరుతాం.. మా నెక్ట్స్ టార్గెట్ అదే. 2023లో మేం తృటిలో టైటిల్ కోల్పోయాం. 2023 వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచినప్పటికీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి తృటిలో కప్‌ను చేజార్చుకోవడం బాధించింది. ఈసారి అలా జరగదు. సౌతాఫ్రికా నుంచి కప్ పట్టుకొస్తాం.. అందుకోసం సిద్ధంగా ఉన్నాం అని టీమిండియా వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ ధీమా వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న సందర్భంగా శుభ్‌మన్ గిల్ ఇలా వ్యాఖ్యానించారు.
ఇదే వేడుకలో పాల్గొన్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. భారత్ జైత్రయాత్ర మొదలైందని, ఇక మమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇప్పుడు వెనక్కి చూసే ఆలోచన లేదు. ఈ అద్భుతమైన ప్రయాణం మొదలైంది కాబట్టి, సాధ్యమైనన్ని ఎక్కువ టైటిల్స్‌ను గెలవడానికి ప్రయత్నిస్తాం’అని సూర్య తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజయం మెగా టోర్నీల్లో భారత జట్లకు స్ఫూర్తినిచ్చిందని సూర్యకుమార్ యాదవ్ గుర్తు చేసుకున్నాడు. ‘మనకు ఒక చిన్న నిప్పురవ్వ లేదా ఒక అడుగు మాత్రమే అవసరమైంది. దాన్ని 2024లో అధిగమించాం. ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2025లో మహిళల వన్డే ప్రపంచకప్, ఆపై 2026 ఈవెంట్‌లతో వరుస విజయాలు వచ్చాయి. ఇప్పుడు వెనక్కి చూసే ఆలోచన లేదు.
