2026ipl| యశ్ దయాల్‌పై వేటు?

2026ipl| యశ్ దయాల్‌పై వేటు?
2026ipl | పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై ఐదేళ్లుగా అత్యాచారం
కొద్ది రోజులకే మరో అమ్మాయి కూడా
టీమ్ బస్సుపై కూడా యశ్ దయాల్ మినహా
2026ipl | ఆంధ్రప్రభ వెబెడెస్క్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆటగాడు యశ్ దయాల్‌పై ఈ సీజన్‌లో వేటు పడే అవకాశాలున్నాయి. ఆ ఆటగాడిపై రెండు కేసులుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై ఐదేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని ఓ యువతి యశ్ దయాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ కేసు విషయం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే మరో అమ్మాయి కూడా తనను అత్యాచారం చేశాడని పోలీసులను ఆశ్రయించింది. ఆమె వయసు 17 ఏళ్లే కావడంతో పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల నేపథ్యంలోనే యశ్ దయాల్‌ను ఆర్‌సీబీ జట్టు దూరం పెట్టినట్లు తెలుస్తోంది.యశ్ దయాల్ ఇంకా ఆర్‌సీబీ ప్రాక్టీస్ క్యాంప్‌లో పాల్గొనలేదు. టీమ్ బస్సుపై కూడా యశ్ దయాల్ మినహా జట్టులోని ఆటగాళ్లందరి ఫొటోలు ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
