జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత

జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత

భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను నేతృత్వంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ సుమారు 20 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వాని నమ్మి, జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు.

జనసేన పార్టీలో చేరే ప్రతి ఒక్కరూ కచ్చితంగా జనసేన పార్టీ సైనికులను, నాయకులను, వీర మహిళలని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. సిద్ధాంతపరమైన రాజకీయాలు చేసే వారికి మాత్రమే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరిన వారి వివరాలు, జగన్నాథం సింహాద్రి, గడ్డం మధురవాణి, గడ్డం యశోద్ కుమార్, ఎండీ హుస్సేన్, ఎండీ పర్వేజ్, తమ్మిన పూర్ణిమ, పద్మావతి, మిరియాల డూన్డేశ్వరరావు, అంకెం మురళీ కృష్ణా, వడ్డీ శ్రీనివాసరావు, హేమ నాగరాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply