18వ వార్డులో కారు జోరు

ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థి గ్యాందంగి తిరుపతి

ప్రచారంలో అడుగడుగునా ప్రజల నుంచి అపూర్వ స్పందన
-బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమంటున్న ప్రజానీకం

భూపాలపల్లి ఫిబ్రవరి6 ఆంధ్రప్రభ: 18వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న యువ నాయకుడు గ్యాదంగి తిరుపతిప్రచారంలో దూసుకుపోతు న్నారు. యువత కావడంతో ఉత్సాహం, డైనమిజంతో ముందుకు సాగు తున్న ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మంచి మనసున్న వ్యక్తిగా ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండి సహాయం చేసే గుణం కలవాడిగా తిరుపతికి వార్డులో ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజ కీయ లాభాల కోసం కాదు…సమాజానికి ఏదైనా చేయాలి..ప్రజల సేవే లక్ష్యంగా పనిచేయాలి అన్న ఆలోచనతోనే ఆయన ప్రజల ముందుకు వచ్చారు. శుక్రవారం పార్టీ నాయకులు వార్డు ప్రజలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజల సమస్యలను శ్రద్ధగా వింటూ ప్రతి గల్లీ ప్రతి కాలనీ సమస్య తనదేనన్నట్టుగా స్పందిస్తున్నా రు. ఓటర్లను కలిసి, మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి, తన ను కౌన్సిలర్ గా గెలిపించాలని అభ్యర్థించారు. యువతతో పాటు పెద్దలు, మహిళలు కూడా ఆయనపై నమ్మకం ఉంచుతూ ఆశీర్వాదం అందిస్తున్నారు.

Leave a Reply