బిఆర్ఎస్ పార్టీ కి జనసేన మద్దతు..

బిఆర్ఎస్ పార్టీ కి జనసేన మద్దతు..
పరకాల, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ) : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తమ పూర్తి మద్దతు బిఆర్ఎస్ పార్టీ కి చేస్తున్నట్లుగా తెలిపారు. మున్సిపల్ 17 వార్డులో జనసేన అభ్యర్థి ఇనుగాల భారతి సంపూర్ణంగా బిఆర్ఎస్ అభ్యర్థి శనిగరం రజినీ నవీన్ కు మద్దతు ఇస్తున్నట్టుగా వార్డు అభివృద్ధికి కలసికట్టుగా పనిచేసి అభివృద్ధిలో భాగం కావడం కోసమే మద్దతు తెలుపుతున్నట్టుగా ప్రకటించారు. జనసేన నాయకులు ఇనుగాల సందీప్, బిఆర్ఎస్ అభ్యర్థి శనిగరం రజినీ నవీన్ కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని బిఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం అని పరకాల అభివృద్ధి మరియు 17వ వార్డు అభివృద్ధి చెందాలంటే మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం అని అందుకోసం కలిసి కట్టుగా పనిచేయాలని భావించి తమ సంపూర్ణ మద్దతు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తెలుపుతున్నట్లుగా ప్రకటించారు.
