అదరించండి అభివృద్ధి చూపిస్తా..

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : నిజాయితీ,సమస్యలు పరిష్కరించాలనే తపన, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే సంకల్పం వస్తున్న తనను ఆదరించాలని బిఆర్ఎస్ 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సంధ్యారాణి రాజా రమేష్ లు కోరారు.గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటర్ మహాశయులను బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా సంధ్యారాణి రాజా రమేష్ లు మాట్లాడుతూ వార్డులో డ్రైనేజీ,రోడ్ల తోపాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

గతంలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చేసిన ఘనత తమ పార్టీకే చెందుతుందని అన్నారు.అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి శూన్యమని గుర్తు చేశారు.ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని కాంగ్రెస్ పరిపాలన పై ప్రజలు పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ అభ్యర్థి సంధ్యారాణి రాజారమేష్ కోరారు.అభివృద్ధి చేసే బాధ్యతగా తాము తీసుకుంటామని పేర్కొన్నారు

Leave a Reply