16 మంది కోడి పందాల రాయుళ్ళు అరెస్ట్..

16 మంది కోడి పందాల రాయుళ్ళు అరెస్ట్..
పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు మండలం గాంధీ ఆశ్రమం పొలాల్లో కోడిపందాలు వేస్తున్న వారి పై శుక్రవారం ఉదయం పోలీసులు మెరుపు దాడి చేశారు. 16 మంది అరెస్ట్, రూ.55820 నగదు, ఒక కోడిపుంజు, రెండు కోడి కత్తులు, 9 బైకులు స్వాధీనం చేసుకున్నారు. పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.శుభాకర్, పామర్రు, కూచిపూడి ఎస్సై లు విజయ్ భాస్కర్, చావా సురేష్ లు ఉదయాన్నే మెరుపు దాడి చేసి పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. గురువారం పెదపారుపూడి మండలంలో రెండు చోట్ల, కూచిపూడిలో పేకాట, కోడిపందాల పై పోలీసులు వరుస దాడులు చేశారు. పామర్రు నియోజకవర్గంలో వరుస దాడులతో పేకాట, కోడిపందాల రాయుళ్లు భయపడుతున్నారు.
