ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా

15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోళ్ళ సంధ్య వెంకటేష్

మక్తల్ , ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) మునిసిపల్ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించండి 15వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోళ్ళ సంధ్య వెంకటేష్ అన్నారు .ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 15వ వార్డు పరిధిలోని కుమ్మరిగేరి, కట్టెల మిషన్ ఏరియా లో విస్తృతంగా మద్దతు దారులతో కలిసి ఇంటిటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో 15వ వార్డు పరిధిలో పూర్తిస్థాయి అభివృద్ధి చేస్తానని అన్నారు. ఇప్పటికే డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు . ఏ పార్టీ కూడా మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు .అభివృద్ధి కావాలంటే తనను ఆదరించి ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటు వేసి కౌన్సిలర్ గా గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటి సరఫరా జరిగేలా చూస్తానన్నారు. అదేవిధంగా డ్రైనేజీలు వేసి రోడ్ల నిర్మాణం చేపడుతామని చెప్పారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కోళ్ల సంధ్య వెంకటేష్ పేర్కొన్నారు .అందుకే ఈ ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపించవలసినదిగా ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యర్థి మద్దతు దారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply