14383 people | మోత్కూర్ లో 86.92% నమోదు…

14383 people | మోత్కూర్ లో 86.92% నమోదు…

  • పోలింగ్ ప్రశాంతం
  • పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎంపీ చామల, ఎమ్మెల్యే సామెల్

14383 people | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు మున్సిపాలిటీ లో బుధవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది .మోత్కూర్ లో 12 వార్డులకు సంబంధించి 26 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయగా, 14383 మంది ఓటర్లకు గాను 12,469 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దీంతో మోత్కూర్ లో 86.92 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల సహాయ అధికారి మున్సిపల్ కమిషన్ కే సతీష్ కుమార్ విలేకరులకు తెలిపారు. 6,165 మంది పురుషులు ,6304 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 12 వార్డులకు సంబంధించి 33 పోస్టల్ బ్యాలెట్లు పోలవ్వగా 22 మంది పురుషులు ,11 మంది మహిళా ఉద్యోగులు ఓటు సద్విని చేసుకున్నారు .దీంతో మోత్కూర్ లో మొత్తం 12,502 ఓట్లు పోలయ్యాయి.

14383 people |

వార్డుల వారీగా పోలైన ఓట్లు

1 వ వార్డులో 1227 … 1040
2 వ వార్డులో 1237 … 994
3 వ వార్డులో 1138 … 1029
4 వ వార్డులో 1099 … 981
5 వ వార్డులో 1110 … 1025
6 వ వార్డులో 1137 … 1011
7 వ వార్డులో 1378… 1181
8 వ వార్డులో 1310… 1099
9 వ వార్డులో 1160 … 1016
10 వ వార్డ్ లో 1203 … 1065
11 వ వార్డులో 1326 … 1107
12 వ వార్డులో 1058… 921

పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు…

14383 people |

బతుకులోని 12 వార్డులకు సంబంధించి 26 పోలింగ్ కేంద్రాల వద్ద సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. కొండగడప ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ సుధాకర్ సామాన్య ప్రజల పట్ల అసభ్య పదజాలం వాడుతూ దూషించడం, హల్చల్ చేయడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు సీఐ వెంకటేశ్వర్లు స్పందించి ఆ పోలింగ్ కేంద్రం నుంచి వేరే చోటికి పంపించారు .శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన సదరు కానిస్టేబుల్ అతిగా ప్రవర్తించడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

14383 people |

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన భువనగిరి ఎంపీ చామల ఎమ్మెల్యే సామెల్…

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొండగడప ,మోత్కూర్, జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల, కొండాపురం , గాంధీనగర్ , బీసీ హాస్టల్, ఇందిరా నగర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ లు వేరువేరుగా సందర్శించారు . కొండాపురంలో 9 వ వార్డు అభ్యర్థి బీసు శ్రీకాంత్ గౌడ్ వద్దకు వెళ్లి ఎంపీ చామల స్వయంగా ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply