135th Anniversary | పూలే ఆశయాలు మరువలేనివి

135th Anniversary | పూలే ఆశయాలు మరువలేనివి
135th Anniversary | భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : బడుగు బలహీన ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి రావు పూలే 135వ వర్ధంతి(135th birthday) పురస్కరించుకుని ఈ రోజు భీమ్‌గల్ మండలంలోని ప్రజా ప్రతినిధులు ముచ్కూర్ చౌరస్తా వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన ఆశయాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్(Satya Shodhak Samaj) (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశాడు.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు(Public Representatives), యూత్ యువకులు జేజే నర్సయ్య, బీ నర్సయ్య, పర్స అనంతరావు, దేవదాస్, మూడేళ్ల ప్రకాష్, గట్టు ఈశ్వర్, ఖాజా మొయినుద్దీన్, రాజేశ్వర్, సయ్యద్ రెహమాన్, అనిల్, అశోక్, భాస్కర్, వాక మహేష్, రవి నాయక్, మల్లెల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
