1334 votes | భార్య సర్పంచ్ భర్త ఉపసర్పంచ్

1334 votes | భార్య సర్పంచ్ భర్త ఉపసర్పంచ్

1334 votes | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన రాచకొండ విష్ణువర్థిని, శంకర్ గౌడ్ భార్య భర్తలు సర్పంచ్, ఉపసర్పంచ్ గా గెలుపొందారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గా సర్పంచ్ బరిలో నిలిచిన రాచకొండ విష్ణు వర్ధిని తన సమీప అభ్యర్థి పై 1334 ఓట్ల(1334 votes) మెజారిటీతో ఘన విజయం సాధించారు.

సర్పంచ్ భర్త రాచకొండ శంకర్ గౌడ్ 11 వ వార్డ్ నుండి విజేతగా నిలిచారు. బడా భీంగల్ లో మొత్తం వార్డ్ లు 12 ఉండగా ఇందులో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ రెండు, ఇండిపెండెంట్(Independent) అభ్యర్థి ఒకటి గెలిచారు. దాంతో సర్పంచ్ భర్త శంకర్ గౌడ్ ను ఉపసర్పంచ్ గా వార్డ్ సభ్యులు ఎన్నుకున్నారు. భార్య సర్పంచ్, భర్త ఉపసర్పంచ్ గా విజయం సాధించడంతో గ్రామంలో విజయోత్సవ వేడుకలు జరిపారు.

Leave a Reply