అమ్మ స్ఫూర్తితో…ప్రజాసేవే లక్ష్యంగా!

అమ్మ స్ఫూర్తితో…ప్రజాసేవే లక్ష్యంగా!

-వార్డులో మురుగు నీటి సమస్యకు తక్షణ పరిష్కారం
-ప్రైమరీ స్కూల్ పరిసరాల్లో వర్షపు నీటి సమస్య పరిష్కారం
-దెబ్బతిన్న రోడ్లు, కుదుకుపోయిన కాలువల మరమ్మత్తులు
-కొత్త కరెంట్ పోల్స్ ఏర్పాటు చేస్తాను
-యువతకు ప్రోత్సాహం, పేదలకు సంక్షేమ పథకాలు
-ప్రతి రెండు నెలలకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తాను
-నిరంతరం అందరికి అందుబాటులో ఉంటాను

  • గౌను గుర్తు సీరియల్ నెంబర్ 6కు ఓటు వేసి ఆశీర్వదించండి. స్వతంత్ర అభ్యర్థిగా సింగాపురం కమలాకర్

ఆంధ్రప్రభ స్టేషన్‌ ఘన్‌పూర్, : అమ్మ స్ఫూర్తితో ప్రజాసేవనే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా సింగాపురం కమలాకర్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన తల్లి సింగాపురం లక్ష్మి గతంలో 12వ వార్డు మెంబర్‌గా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. ఆమె సేవలను ఆదర్శంగా తీసు కుని, మరింతగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయ రంగం లోకి అడుగుపెట్టారు. తన తల్లి హయాంలో వార్డులో రెండు సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం వంటి కీలక పనులు జరిగా యి. సింగాపురం బాలస్వామి ఇంటి నుంచి కృష్ణమూర్తి ఇంటి వరకు రూ.6 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అలాగే ఇంటిం టికీ అధికారులతో మాట్లాడి మిషన్ భగీరథ తాగునీటి సరఫరా కల్పిం చడంతో పాటు, నిరటి గల్లీలో ప్రతి ఇంటికీ నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. అభివృద్ధి అంటే ఏమిటో తెలిసిన కుటుంబానికి చెందిన వ్యక్తి గా, ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలిసిన నాయకుడిగా కమలాకర్ ప్రజల ముందుకు వచ్చారని స్థానికులు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా గౌను గుర్తుకు, సీరియల్ నెంబర్ 6కు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు.

-ప్రతి రెండు నెలలకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తాను:

వార్డులో స్థానిక నాయకులతో కలిసి అభ్యర్థి కమలాకర్ బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రజానాయకుడిగా ఇప్పటికే 15 ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాను. గెలిచిన అనంతరం మరో 50 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించే పూర్తి బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు. అనంతరం వార్డులో నెలకొన్న పలు సమస్యలను గుర్తించి, పరిష్కారానికి హామీలు ప్రకటించారు. మాతంగి నర్సయ్య ఇంటి నుంచి జహంగీర్ ఇంటి వరకు ఉన్న పెద్ద కాలువలో మురుగు నీరు సమస్యను వెంటనే పరిష్కారానికి కృషి చేస్తా ను. అలాగే ప్రైమరీ స్కూల్ ప్రాంతం నుంచి కాలువలు పూర్తిగా కుదుకు పోయి వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్న పరిస్థితిని త్వరలోనే పరిష్కరి స్తామని తెలిపారు. సమాధి వద్ద గేట్ ఉన్నప్పటికీ లాక్ లేకపోవడం, పురుషులు,మహిళల కోసం వేర్వేరు గదులు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అవసరమైన సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. తాటికొండ మధు ఇంటి నుంచి దయాకర్ ఇంటి ముందు సర్వీస్ రోడ్ వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతిని, కాలువలు కుదుకుపోయి తీవ్ర సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతం లో తక్షణమే మరమ్మత్తులు చేపడతామని తెలిపారు. ఐలపాక లక్ష మయ్య ఇంటి నుంచి చింత భాస్కర్ ఇంటి వరకు కరెంట్ పోల్స్ ఏర్పా టు చేస్తామని తెలిపారు. యువతకు ప్రోత్సాహం అందిస్తాను. అర్హులైన వారికి రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదేనని స్పష్టం చేశారు. మట్టి రోడ్లు లేకుం డా వార్డు అంతటా కొత్తగా సీసీ రోడ్లు మంజూరు చేయిస్తానని, డ్రైనేజీ, కాలువల నిర్మా ణానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. నిరుపేద లకు ఇండ్లు ఇప్పించి, ప్రతి ఒక్క రికీ అందుబాటులో ఉండే నాయకత్వాన్ని అందిస్తానని చెప్పారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి వార్డు సమస్య లను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తాను. అభివృద్ధి అజెండాతో ప్రజల సేవకే తన రాజకీయ ప్రయాణమని కమలాకర్ తెలిపారు.

Leave a Reply